
కామంతో కళ్లు మూసుకుపోయిన వ్యక్తులకు భయం, సిగ్గు ఉండవు అంటారు. అవే కాదు.. వారికి వయసుతో కూడా సంబంధం ఉండదని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. 13 ఏళ్ల బాలికపై పెళ్లై, పిల్లలు కూడా ఉన్న ఓ వ్యక్తి గత ఐదు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. శృంగారం అంటే ఏంటో కూడా తెలియని ఆ బాలికను అతను తన పశువాంఛకు వినియోగించుకున్నాడు.
ముంబైలోని ఓ కాలనీలో నివసిస్తున్న 13 ఏళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కన్నేశాడు. బాలిక పక్కింట్లోనే నిందితుడు తన భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. బాలిక ఇంటికి అతను తరచుగా వెళ్లేవాడు. తరచుగా అతను ఇంటికి వస్తున్నా తెలిసిన వాడే కావడంతో ఇంట్లో వారు అనుమానించలేదు. దీంతో ఆ కామాంధుడు బాలికను తన వలలో వేసుకున్నాడు. ప్రతి రోజూ బాలిక ఇంటికి వెళ్లి ఎవరూ లేని సమయంలో ఆమెతో శృంగారం సాగించేవాడు. ఆ విషయం ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించడంతో ఆ బాలిక తన తల్లిదండ్రులకు కూడా చెప్పలేదు.
ఐదు నెలలుగా ఆ బాలికపై అతను అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఇటీవల ఆ బాలిక కడుపు నొప్పి వస్తోందని తల్లిదండ్రులకు చెప్పింది. వారు ఆ బాలికను హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆ బాలిక గర్భవతి అని తేల్చారు. ఆ బాలికను అడిగితే అప్పుడు అసలు విషయం చెప్పింది. రోజూ తన ఇంటికి వచ్చే స్నేహితుడు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని తెలిసి తండ్రి షాకయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.