ఆస్పత్రి బెడ్‌పై ఉండి మరీ ఇంటర్వ్యూకు హాజరైన కుర్రాడు.. అతడి పరిస్థితి తెలిసి అవాక్కైన రిక్రూటర్లు..!

ABN , First Publish Date - 2022-04-28T09:10:38+05:30 IST

ఉద్యోగ ఇంటర్వూలకు ఇంటి నుంచే వీడియో కాల్ ద్వారా హాజరు కావడం ఇటీవల కాలంలో సాధారణ విషయం. అలా వీడియో కాల్ ద్వారా తాజాగా ఒక యువకుడు ఇంటర్వూకు హాజరయ్యాడు. అతడి పరిస్థితి చూసి కంపెనీ రిక్రూటర్లు ఆశ్చర్యపోయారు. కష్టమైన పరిస్థితుల్లో కూడా అతడి గుండె ధైర్యం...

ఆస్పత్రి బెడ్‌పై ఉండి మరీ ఇంటర్వ్యూకు హాజరైన కుర్రాడు.. అతడి పరిస్థితి తెలిసి అవాక్కైన రిక్రూటర్లు..!

ఉద్యోగ ఇంటర్వూలకు ఇంటి నుంచే వీడియో కాల్ ద్వారా హాజరు కావడం ఇటీవల కాలంలో సాధారణ విషయం. అలా వీడియో కాల్ ద్వారా తాజాగా ఒక యువకుడు ఇంటర్వూకు హాజరయ్యాడు. అతడి పరిస్థితి చూసి కంపెనీ రిక్రూటర్లు ఆశ్చర్యపోయారు. కష్టమైన పరిస్థితుల్లో కూడా అతడి గుండె ధైర్యం చూసి అవాక్కయ్యారు. ఇంతకీ అతనికొచ్చిన కష్టమేమిటంటే..


వివరాల్లోకి వెళితే.. అర్ష్ ఆనంద్ ప్రసాద్ అనే యువకుడు క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స కోసం కీమోథెరపీ తీసుకుంటూ ఆస్పత్రి బెడ్‌పై ఉన్నాడు. ఆ సమయంలో అతనికి ఉద్యోగ ఇంటర్‌వ్యూ కాల్ వచ్చింది. తను ఉన్న కష్టమైన పరిస్థితులను కూడా లెక్క చేయకుండా అతను ఇంటర్‌వ్యూకు హాజరయ్యాడు. ఆస్పత్రి బెడ్‌పై పద్మాసనం వేసి కూర్చొని ధ్యైర్యంగా రిక్రూటర్లు అడిగే ప్రశ్నలను ఎదుర్కొన్నాడు. ఆనంద్ చూట్టూ ఉండే పరిస్థితులను గమనించిన రిక్రూటర్లు.. అతనికి క్యాన్సర్ అని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. అయినా అతనికి ఉద్యోగం ఇవ్వలేదు. అతడు అనారోగ్యం పట్ల సానుభూతి తెలిపుతూ ఆనంద్‌‌కు సారీ చెప్పారు. 


ఆ తరువాత ఆనంద్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ఆ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ పోస్ట్‌లో "ఉద్యోగ ఇంటర్‌వ్యూలో మీరు ఎంత ప్రతిభ కనబర్చినా రిక్రూటర్లు మిమల్ని మీ వ్యక్తిగత జీవితంలో ఉన్న కష్టాల వల్ల తిరస్కరిస్తే వారు ఎంత సానుభూతి పరులో అర్థమవుతుంది. ఎందుకంటే నా ప్రతిభను వారు పట్టించుకోకుండా.. కేవలం నాకు క్యాన్సర్ అని తెలియగానే వారి ముఖంలో మార్పులు స్పష్టంగా చూశాను." అని రాశాడు. దీంతో పాటు ఆనంద్ తను ఇంటర్‌వ్యూ అటెండ్ చేసిన ఫొటో కూడా పోస్ట్‌లో పెట్టాడు. ఆ ఫొటో కింద "నేను ఉన్న పరిస్థితులను చూసి మీరు జాలి చూపాల్సిన అవసరం లేదు. నేనేంటో నిరూపించుకోవడానికే  ఇంటర్‌వ్యూలు అటెండ్ అవుతున్నాను " అని రాశాడు.


ఆనంద్ పెట్టిన పోస్ట్‌కు నెటిజన్ల నుంచి విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు ఈ పోస్ట్‌కు 88,000 మంది లైక్ చేయగా.. 3,000 కామెంట్లు వచ్చాయి. పైగా 500 సార్లు ఈ పోస్టును షేర్ చేశారు. 


ఆనంద్ పోస్ట్ చదివిన ఒక సాఫ్టవేర్ కంపెనీ యజమాని అతనికి తన కంపెనీలో జాబ్ ఆఫర్ చేశాడు.




Updated Date - 2022-04-28T09:10:38+05:30 IST