Advertisement

కోడలిని భర్తకు దగ్గరకానీయ్యని మామ.. ఎందుకో తెలిస్తే..

Aug 6 2020 @ 19:57PM

గాంధీనగర్: భర్తకు దగ్గరకానీయకుండా కోడలికి అడ్డుపడుతున్న అత్తమామలపై  గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు. విస్తుగొలిపే ఈ ఘటన రాజధాని గాంధీనగర్‌లో చోటుచేసుకుంది. తనను ప్రేతాత్మ ఆవహించిందంటూ ఇబ్బంది పెట్టేవాడని కోడలు మామపై ఫిర్యాదు చేసింది. భర్తకు దగ్గరైతో ఆ ప్రేతాత్మ దేహం మార్చుకుని కొడుకులో ప్రెవేసిస్తుండంటూ భర్త దగ్గరవ్వనిచ్చే వాడు కాదని ఆమె పేర్కొంది. దీనికి అత్త కూడా వత్తాసు పలికేదని.. ఆమె పలు మార్లు మామను తనపై ఉసిగొల్పిందని, లైంగిక వేధింపులకు పాల్పడేలా చేసిందని కూడా బాధితురాలు తెలిపింది. అత్తమామలపై గృహహింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. పోలీసులను ఆశ్రయిస్తే దారుణ ఫలితాలు అనుభవించాల్సి ఉంటుందంటూ తనను బెదిరంచే వారని తెలిపింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సదరు మహిళకు ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లైందని, నెల తిరక్కుండానే ఈ గొడవల కారణంగా ఆమె పుట్టింటికొచ్చేసిందని పోలీసులు తెలిపారు. 

Follow Us on:
Advertisement

క్రైమ్ మరిన్ని...

Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.