కరోనా టీకా కేంద్రం వద్ద పోలీసులు కొట్టారని యువకుడి ఆత్మహత్య!

Jul 27 2021 @ 18:49PM

లఖ్‌నవూ: టీకా కేంద్రం వద్దకు వెళ్లిన తనను పోలీసులు అకారణంగా కొట్టారని వ్యధ చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్‌లోని బాఘ్‌పట్ జిల్లాలోని ఓ టీకా కేంద్రంలో సోమవారం ఈ దారుణం జరిగింది. యువకుడిని కొట్టడమే కాకుండా.. అతడి తల్లిపైనా పోలీసులు చేయి చేసుకున్నారని బంధువులు ఆరోపించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం పది మంది పోలీసులను ఉన్నతాధికారులు విధుల నుంచి తప్పించారు. ఆత్మహత్యకు పురికొల్పారనే నేరం కింద వారిలో ఐదుగురిపై కేసు నమోదైంది. 

Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.