ఇద్దరూ ఊరు వదిలి పారిపోయారు.. తిరిగి వచ్చాక యువతి తండ్రి, అన్న ఎంత దారుణానికి తెగించారంటే..

Sep 15 2021 @ 11:20AM

వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెద్దలు అంగీకరంచకపోవడంతో ఊరు వదిలి పారిపోయారు.. ఇరు కుటుంబ సభ్యులు, పెద్దలు వారిని బతిమాలి పెళ్లి చేస్తామని చెప్పి ఊరికి తిరిగి రప్పించారు.. వారు వచ్చాక యువతి కుటుంబ సభ్యులు దారుణానికి తెగించారు.. పట్ట పగలు నడిరోడ్డుపై యువకుడిపై దాడి చేశారు.. విచక్షణారహితంగా సుత్తి, ఇనుపరాడ్‌తో కొట్టారు.. తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.. మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 


మక్సి నగరానికి చెందిన పుష్పక్ భావ్సర్(22) అనే యువకుడు, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. తల్లిదండ్రులు అంగీకరించరనే భయంతో ఇద్దరూ ఊరు వదిలి పారిపోయారు. దీంతో యువతి తల్లిదండ్రులు, ఇరు కుటుంబాలకు సంబంధించిన పెద్దలు వారిని బతిమాలి ఇంటికి రప్పించారు. పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేస్తామన్నారు. దీంతో వారు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. త్వరలోనే పెళ్లి చేస్తామని అనడంతో ఎవరిళ్లకు వాళ్లు వెళ్లిపోయారు. అలా వచ్చాక యువకుడిపై యువతి తండ్రి, అన్న దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. 

ఆదివారం ఉదయం పుష్పక్‌ కటింగ్‌ చేయించుకునేందుకు షాప్‌నకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన యువతి తండ్రి, అన్న.. పుష్పక్‌ను షాప్‌ నుంచి బయటకు లాగేశారు. అనంతరం నడిరోడ్డుపై సుత్తి, ఇనుప రాడ్‌తో విచాక్షణారహితంగా కొట్టారు. దెబ్బలకు తాళలేక పుష్పక్ కేకలు పెట్టాడు. ఈ దాడిలో పుష్పక్‌ కాలు, చేతికి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై యువకుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా, ఈ దాడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  


ఇవి కూడా చదవండి :

17 ఏళ్ల కుర్రాడు మిస్సింగ్.. పక్కింట్లో ఉండే 30 ఏళ్ల వివాహిత కూడా అదృశ్యం.. అసలు కథేంటో తెలిసి అంతా షాక్..!ఫోన్లో బొమ్మల వీడియోలు పెట్టి రెండేళ్ల కొడుక్కి ఇచ్చి స్నానానికి వెళ్లిందా తల్లి.. తిరిగొచ్చేసరికి జరిగిన దారుణమిది..!

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...