కుమార్తె తల నరికిన కసాయి తండ్రి

ABN , First Publish Date - 2021-03-04T15:11:12+05:30 IST

తనకు నచ్చని యువకుడితో కుమార్తె ప్రేమాయణం నడుపుతుందనే కోపంతో ఆమె తల నరికి చంపి, తల తీసుకొని పోలీసుస్టేషనుకు వచ్చిన కసాయి తండ్రి ...

కుమార్తె తల నరికిన కసాయి తండ్రి

హార్దోయి (ఉత్తర్‌ప్రదేశ్):తనకు నచ్చని యువకుడితో కుమార్తె ప్రేమాయణం నడుపుతుందనే కోపంతో ఆమె తల నరికి చంపి, తలను చేతిలో పట్టుకొని పోలీసుస్టేషనుకు వచ్చిన కసాయి తండ్రి బాగోతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హార్దోయి జిల్లాలో జరిగింది. పండేతర గ్రామానికి చెందిన సర్వేష్ కుమార్ తన కుమార్తె రెండు రోజుల క్రితం ఓ యువకుడితో ప్రేమాయణం సాగిస్తుండగా చూసి ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనకు నచ్చని యువకుడితో కుమార్తె ప్రేమాయణం సాగిస్తుందనే కోపంతో తండ్రి ఆమెకు గుణపాఠం నేర్పించాలనుకున్నాడు. తండ్రి సర్వేష్ తన ఇంట్లో ఒంటరిగా ఉన్న కుమార్తెకు పదునైన ఆయుధంతో శిరచ్ఛేదం చేశాడు. అనంతరం సర్వేష్ కుమార్తె తలను చేతిలో పట్టుకొని పోలీసుస్టేషన్ వైపు నడిచి వచ్చాడు. స్థానికులు భయభ్రాంతులై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సర్వేష్ ను అరెస్టు చేశారు. కుమార్తెను హతమార్చిన సర్వేష్ పై కేసు నమోదుచేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అనురాగ్ చెప్పారు.

Updated Date - 2021-03-04T15:11:12+05:30 IST