పొడుగు పెరగాలన్న తాపత్రయంతో.. ఏకంగా రూ.60 లక్షలు..ఇతడి కథ ఏంటంటే..

ABN , First Publish Date - 2022-09-21T03:03:49+05:30 IST

పొడుగు పెంచే ఆపరేషన్(Leg lengthening Operation) కోసం అమెరికాలోని ఓ వ్యక్తి ముందూ వెనుకా ఆలోచించకుండా 75 వేల డాలర్లు అప్పు చేశాడు.

పొడుగు పెరగాలన్న తాపత్రయంతో.. ఏకంగా రూ.60 లక్షలు..ఇతడి కథ ఏంటంటే..

ఎన్నారై డెస్క్: పొడుగు పెంచే ఆపరేషన్(Leg lengthening Operation) కోసం అమెరికాలోని ఓ వ్యక్తి ముందూ వెనుకా ఆలోచించకుండా 75 వేల డాలర్లు అప్పు చేశాడు. మన కరెన్సీలో చెప్పుకోవాలంటే ఇది దాదాపు రూ.9.8 లక్షలు. ఇప్పుడు ఈఎమ్‌ఐ కింద అతడు నెలకు 1200 డాలర్లు చెల్లించాలి..అదీ ఐదేళ్ల పాటు. అంటే..అప్పు మొత్తం తీరేసరికి 72 వేల డాలర్ల చేతిచమురు వదిలిపోతుంది. మనకరెన్సీలో సుమారు రూ.60 లక్షలు. ఐనా అతడు లెక్క చేయలేదు. మూడు అంగుళాల పొడవు పెరిగేందుకు ఈమాత్రం చేయకతప్పదు అంటున్నాడు. అతడి పేరు..జాన్. ఉండేది అమెరికాలో(America)..!


ఇలా పొడుగు పెంచే ఆపరేషన్లు చేయించుకోవాలంటే సగటున 70 వేల నుంచి 1.5 లక్షల డాలర్ల వరకూ ఖర్చవుతుంది. ఎంత ఎత్తు పెరగాలనే దాన్నిబట్టి ధర ఆధారపడి ఉంటుంది. ఇంతలా అప్పు చేయడం అవసరమా అని అడిగితే అవసరమే అని జాన్ ఠక్కున సమాధానం చెప్పాడు. పొడుగోళ్ల ముందు ప్రపంచం మోకరిల్లుతున్న విషయాన్ని తాను గమనించే ఇలాంటి నిర్ణయం తీసుకున్నానన్నాడు. ఆపరేషన్‌కు ముందు అతడి పొడవు 5 అడగులు 8.5 అంగుళాలు. ఇప్పుడేమో ఆరడుగుల పైనే. కానీ..తాను అనుకున్నది దక్కించుకున్నందుకు అతడి సంతోషానికి అవధులే లేకుండా పోయాయి. 


పొడవు పెరిగే ఆపరేషన్ కోసం వైద్యులు తొడ ఎముకలకు రాడ్లను అమర్చి వాటి పొడవు పెరిగేలా చేస్తారు. ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. పేషెంట్లు కొన్ని నెలల పాటు మంచానికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆ సమయంలో వాళ్లు తీవ్ర వేదన అనుభవిస్తారు. అయితే పొడగరులుగా మారాలనుకున్న వారు దేన్నీ లెక్కచేయట్లేదు. ఇటీవల అమెరికాలో టెక్ రంగంలోని(IT Employees) ఉద్యోగులు ఎక్కువగా ఇటువంటి ఆపరేషన్లు చేయించుకుంటున్నారని అక్కడి వైద్యులు చెబుతున్నారు. 

Updated Date - 2022-09-21T03:03:49+05:30 IST