24 గంటల పాటు మోదీజీ జపం... యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్!

ABN , First Publish Date - 2020-09-18T17:02:37+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ నిన్న (సెప్టెంబరు17)న తన 70వ పుట్టినరోజు చేసుకున్న విషయం విదితమే. ఈ సందర్భంగా మోదీకి వివిధ దేశాధినేతలతో పాటు సామాన్యులు...

24 గంటల పాటు మోదీజీ జపం... యూట్యూబ్‌లో లైవ్ స్ట్రీమ్!

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నిన్న (సెప్టెంబరు17)న తన 70వ పుట్టినరోజు చేసుకున్న విషయం విదితమే. ఈ సందర్భంగా మోదీకి వివిధ దేశాధినేతలతో పాటు సామాన్యులు సైతం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఒక యూట్యూబర్ ప్రధాని మోదీకి ప్రత్యేక రీతిలో అభినందనలు తెలిపారు. అన్‌మోల్ బకాయా అనే ఈ యూట్యూబర్ తన ఛానల్‌లో ప్రధాని మోదీకి యూ ట్యూబ్ లైవ్ స్ట్రీమ్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ఏకంగా 24 గంటల పాటు మోదీజీ పేరు జపిస్తూ శుభాభినందనలు తెలిపారు. ఈ లైవ్ జపం సందర్భంగా స్క్రీన్‌పై కౌంటింగ్ కూడా ప్రదర్శించారు. 24 గంటల్లో  ఏకంగా 1,03,643 సార్లు ‘మోదీజీ’ పేరును ఉచ్ఛరించారు. 


Updated Date - 2020-09-18T17:02:37+05:30 IST