బాలికను పెళ్లి చేసుకుంటాననే హామీతో నిందితుడికి బెయిలు

ABN , First Publish Date - 2020-11-07T18:09:35+05:30 IST

ఓ 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిపి, ఆమెను గర్భవతిని చేసిన నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన హామీతో....

బాలికను పెళ్లి చేసుకుంటాననే హామీతో నిందితుడికి బెయిలు

మధురై (తమిళనాడు): ఓ 17 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిపి, ఆమెను గర్భవతిని చేసిన నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకుంటానని ఇచ్చిన హామీతో మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ బెయిలు మంజూరు చేసింది. 17 ఏళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చింది. దీంతో బాలిక ఫిర్యాదు మేర పోలీసులు  పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. బాలికకు 18ఏళ్లు నిండగానే వచ్చే ఏడాది అక్టోబరు 10వతేదీలోగా తాను వివాహం చేసుకుంటానని నిందితుడు కోర్టుకు విన్నవించాడు.


 దీంతో వివాహం చేసుకొని వివాహ సర్టిఫికెట్ ను పోలీసుస్టేషనులో సమర్పించాలని హైకోర్టు మధురై బెంచ్ ఆదేశిస్తూ 90 రోజుల పాటు జైలులో ఉన్న నిందితుడికి బెయిలు మంజూరు చేసింది. బాలికను తన క్లయింట్ అయిన నిందితుడు ప్రేమించాడని, ఆమెను వివాహం చేసుకుంటాడని నిందితుడి లాయర్ కోర్టును అభ్యర్థించడంతో కోర్టు బెయిలు ఇచ్చింది. 

Updated Date - 2020-11-07T18:09:35+05:30 IST