Advertisement

భార్య తల నరికి అనుమానితుడి ఇంటిముందు పడేసిన భర్త

Oct 15 2020 @ 14:27PM

సంగారెడ్డి: వేరే వ్యక్తితో శారీరక సంబంధం ఉందనే కారణంతో కట్టుకున్న భార్య తల నరికాడు ఓ వ్యక్తి. అంతేనా ఆమె తలతో ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి శారీరక సంబంధం ఉందని భావిస్తున్న వ్యక్తి ఇంటి గుమ్మం ముందు పడేశాడు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిందీ సంఘటన.


నారాయణఖేడ్‌కు చెందిన సాయిలు (50), చాలా ఏళ్ల క్రితమే పెళ్లైంది. దాదాపు మూడు దశాబ్దాల వివాహ అనుబంధంలో లోటుపాట్లు ఉన్నప్పటికీ సాఫీగానే సాగింది. అయితే తాజాగా భార్యకు ఎవరితో శారీరక సంబంధం ఉందనే అనుమానం సాయిలుకు వచ్చింది. అంతే.. బుధవారం అదును చూసి భార్య తలను గొడ్డలితో నరికేశాడు. అనంతరం ఆ తలతో 5 కిలోమీటర్లు ద్విచక్ర వాహనంపై వెళ్లి తన భార్యతో శారీరక సంబంధం ఉందని భావిస్తున్న వ్యక్తి ఇంటి గుమ్మం ముందు పడేశాడు.


నేరస్తుడు సాయిలును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుపై విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.