Pepsi: పెప్సీ క్యాన్లతో ఇంటిని నింపేసిన వ్యక్తి.. Guinness World Record కైవసం..!

ABN , First Publish Date - 2022-07-09T00:14:58+05:30 IST

ఇటలీకి చెందిన క్రిస్టియన్ కావాలెట్టి అనే వ్యక్తి అరుదైన ఘనతను సాధించాడు.

Pepsi: పెప్సీ క్యాన్లతో ఇంటిని నింపేసిన వ్యక్తి.. Guinness World Record కైవసం..!

ఇటలీకి చెందిన క్రిస్టియన్ కావాలెట్టి అనే వ్యక్తి అరుదైన ఘనతను సాధించాడు. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఖండంలోనూ పెప్సీ క్యాన్లను సేకరించి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించాడు. అతని దగ్గర మొత్తం 12,042 పెప్సీ క్యాన్లు ఉన్నాయి. 4,391 పెప్సీ క్యాన్లను సేకరించి 2004లోనే క్రిస్టియన్ తొలిసారి గిన్నీస్ బుక్ ఎక్కాడు. తాజాగా తన రికార్డును తానే తిరగరాసుకున్నాడు. తన ఇంటిని పెప్సీ క్యాన్ల మ్యూజియంగా మార్చేశాడు. వాటిని చూస్తే పెప్సీ క్యాన్లలో ఇన్ని రకాలు ఉన్నాయా అని ఆశ్చర్యపోవడం ఖాయం.


క్రిస్టియన్, ఆయన సోదరుడు ఎడోర్డో 1989 నుంచి పెప్సీ క్యాన్లను సేకరిస్తున్నారు. ఏడు ఖండాలలోని 81 దేశాల నుంచి వాటిని సేకరించారు. వాటిల్లో పెప్సీ సంస్థ అరుదుగా రిలీజ్ చేసిన క్యాన్స్ కూడా ఉన్నాయి. పెప్సీ సంస్థ తొలిసారి 1948లో విడుదల చేసిన క్యాన్ కూడా క్రిస్టియన్ దగ్గర ఉంది. అలాగే 1980లో ఓ వ్యోమగామి అంతరిక్షంలోకి వెళ్తూ తాగిన స్పేస్ పెప్సీ క్యాన్‌ను కూడా క్రిస్టియన్ సంపాదించాడు. ఆ క్యాన్‌ను అంతరిక్షంలో తాగేందుకు వీలుగా తయారుచేశారు. సేకరించిన క్యాన్లు అన్నింటినీ క్రిస్టియన్ తన ఇంట్లో ప్రత్యేక అరల్లో డెకరేట్ చేసి ఇంటిని మ్యూజియంలా మార్చేశాడు.


Updated Date - 2022-07-09T00:14:58+05:30 IST