పెళ్లయి రెండేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపం.. భార్య నిద్రపోయాక భర్త బలవన్మరణం..!

Published: Thu, 23 Jun 2022 19:37:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
పెళ్లయి రెండేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని మనస్తాపం.. భార్య నిద్రపోయాక భర్త బలవన్మరణం..!

కొందరు చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దవిగా భావించి, పదే పదే అదే ఆలోచనతో చివరకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. ఈ క్రమంలో కొందరు హత్యలు, ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఛత్తీస్‌గఢ్‌లో ఓ వ్యక్తి ఇలాగే చేశాడు. పెళ్లయి రెండేళ్లయినా పిల్లలు పుట్టడం లేదని తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. రోజూ ఇదే విషయం గురించే ఆలోచించేవాడు. ఓ రోజు భార్య నిద్రపోయాక.. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ మగర్రోడా గ్రామానికి చెందిన హేమ్‌లాల్ యాదవ్ (25)కు రెండేళ్ల క్రితం ఓ యువతితో వివాహమైంది. పెళ్లయిన కొన్ని నెలలు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే నెలలు గడిచే కొద్దీ హేమ్‌లాల్ యాదవ్ ఆలోచనలో పడ్డాడు. రెండేళ్లవుతున్నా పిల్లలు పుట్టలేదనే విషయంపై రోజూ తీవ్రంగా ఆలోచించేవాడు. కొన్నాళ్లకు మానసికంగా తీవ్రంగా కుంగిపోయాడు. పిల్లల విషయమై అప్పుడప్పుడూ భార్యతో గొడవపడేవాడు. అయితే రోజూ అతడు ఇదే విషయం గురించి ఆలోచించడంతో చివరకు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడు. అప్పుడప్పుడూ మద్యం తాగొచ్చి ఇంట్లో గొడవపడేవాడు. బుధవారం కూడా ఫుల్‌గా మద్యం తాగొచ్చి, భార్యతో గొడవపడ్డాడు.

ప్రేమలో పడిన వారికి కుక్క కంటే హీనమైన చావు తప్పదంటూ వాట్సప్ స్టేటస్‌లు పెట్టి మరీ 27 ఏళ్ల యువతి దారుణమిది..!

అర్ధరాత్రి భోజనం చేసిన అనంతరం నిద్రపోయాడు. అయితే ఉదయం భార్య లేచి చూస్తే.. ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఊహించని ఈ ఘటనతో షాకైన ఆమె.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయం తెలియజేసింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. హేమ్‌లాల్ ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. హేమ్‌లాల్ మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.

గాజులు కొనుక్కుంటానంటే పెళ్లయిన ఏడో రోజే మార్కెట్‌కు తీసుకెళ్లిన భర్త.. నడిరోడ్డుపై ఊహించని షాకిచ్చిన భార్య..!

ఇవి కూడా చదవండిLatest News in Telugu

రూ.93 కోట్ల ఆస్తికి వారసురాలు.. అయినా రూపాయి కూడా వాడుకోలేని స్థితి.. మరణించేముందు తండ్రి పెట్టిన ఆ ఒక్క కండీషన్‌తో..!ఉన్నట్టుండి చనిపోయిన మహిళ.. ఇంట్లో ఉన్న 20 పెంపుడు పిల్లులకు భోజనం పెట్టే వారే లేక ఆమె మృతదేహాన్నే..9 నెలల గర్భవతి అయిన నా భార్యను కాపాడండి.. తాగడానికి నీళ్లు కూడా లేవంటూ ముఖ్యమంత్రికి మెయిల్ పంపిన భర్త.. చివరకు..videoరూ.28 చిల్లర కోసం గొడవ.. ఆటో వెంట పడుతూ ప్రాణాలు కోల్పోయిన టెకీ.. ఆరేళ్ల తర్వాత రూ.43 లక్షల పరిహారం.. 36 రోజుల క్రితం పెళ్లి.. సిటీలో కొత్త కాపురం.. భార్యను ఇంట్లోనే ఉంచి సొంతూరికి వచ్చి భర్త ఆత్మహత్య.. అసలు ట్విస్ట్ ఏంటంటే..ఒకే రోజు.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది మృతి.. తెల్లారినా ఆ ఇళ్లల్లో తలుపులు తీయకపోవడంతో స్థానికులు వెళ్లి చూస్తే..
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.