కొడుకు సహజీవనం చెడగొట్టేందుకు తండ్రి చేసిన దారుణం

ABN , First Publish Date - 2022-02-22T21:50:43+05:30 IST

తన కొడుకు ఒక మహిళతో సహజీవనం సాగిస్తున్నాడని తెలుసకున్న ఒక తండ్రి ఎలాగైనా ఆ బంధాన్ని విడగొట్టాలని రౌడీ సహాయంతో సదరు మహిళ రహస్య ఫొటోలను ఆమె తండ్రికి పంపాడు..

కొడుకు సహజీవనం చెడగొట్టేందుకు తండ్రి చేసిన దారుణం

బెంగళూరు: తన కొడుకు ఒక మహిళతో సహజీవనం సాగిస్తున్నాడని తెలుసకున్న ఒక తండ్రి ఎలాగైనా ఆ బంధాన్ని విడగొట్టాలని రౌడీ సహాయంతో సదరు మహిళ రహస్య ఫొటోలను ఆమె తండ్రికి పంపాడు. అనంతరం వాళ్లు నివాసం ఉంటున్న నగరాన్ని విడిచిపెట్టి పోవాలని అదే రౌడీతో ఆమెను బెదిరించాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన బాధిత మహిళ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. మహిళ రహస్య ఫొటోలను ఆమె తండ్రికి పంపిన నేరస్తుడిని పోలీసులు పట్టుకుని విచారించగా.. బాలుడి తండ్రి తనను ఎంతగారో బతిమాలాడాడని అందుకే తాను ఈ పనికి ఒప్పుకున్నట్లు పేర్కొన్నాడు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒక మహిళ (25) చదువు నిమిత్తం పొరుగు రాష్ట్రం నుంచి బెంగళూరుకు కొద్ది సంవత్సరాల క్రితం వచ్చింది. కొద్ది రోజులకు ఆమె తనకన్నా చిన్నవాడైన ఒక బాలుడితో ప్రేమలో పడింది. అనంతరం వారి ప్రేమాయణం సహజీవనం వరకూ వెళ్లింది. అయితే ఈ సహజీవనం బాలుడు నివసించే ఇంట్లోనే కొనసాగుతోంది. ఈ విషయంపై బాలుడి తల్లిదండ్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలోనే ఆమె రహస్య ఫొటోలు ఆమె తండ్రికి చేరాయి. ఆ మహిళ నుంచి తన కుమారుడిని వేరు చేసేందుకు ఆయనే స్వయంగా ఒక నేరస్తుడికి పంపి, వాటిని మహిళ తండ్రికి పంపాలని కోరినట్లు పోలీసుల విచారణలో తేలింది.


మహిళ తండ్రికి ఫొటోలు పంపిన అనంతరం, ఆమెను కలిసి బెంగళూరు వదిలేసి వెళ్లాలని బెదిరింపులకు పాల్పడ్డు ఒప్పుకున్నారు. ఒకవేళ నగరం విడిచి వెళ్లకపోతే ఆమె ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరించారట. ఆమె వెంటనే బెంగళపూరు సౌత్ ఈస్ట్ సీఈఎన్ పోలీసులను సంప్రదించడంతో వారు నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు.

Updated Date - 2022-02-22T21:50:43+05:30 IST