
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా సరే సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో అందరికీ తెలిసిపోతుంటుంది. ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఐపీఎస్ ఆఫీసర్ స్వాతి లక్రా.. ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ వీడియోను చూసి నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇంతకూ ఆ వీడియోలో ఏముంది అనే వివరాల్లోకి వెళితే..
పల్లెటూర్లలో గతుకులతో కూడిన మట్టి రోడ్లు ఉండటం సహజం. ఆ రోడ్లపై నీళ్లు నిలిస్తే.. పరిస్థితిని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి రోడ్లపై కాలినడకన వెళ్లాలన్నా ఇబ్బందులు తప్పవు. సరిగ్గా అటువంటి రోడ్డుపైనే ఓ వ్యక్తి వినూత్నంగా ప్రయాణించాడు. సైకిల్‌పై ఓ మూట పెట్టుకుని.. కాళ్లకు ఏ మాత్రం బురద అంటకుండా జాగ్రత్తగా వెళ్లాడు. అలాగని సైకిల్ తొక్కాడా అంటే.. అదీ లేదు. రోడ్డు పక్కన ఉన్న ఇంటి గోడపై రోడ్డుకు అడ్డంగా నడుస్తూనే.. బురద నీటి గుండా చాలా నేర్పుగా సైకిల్‌ను ముందుకు తోశాడు. చివరికి సైకిల్ తొక్కకుండా.. బురద అంటకుండానే విజయవంతంగా బురద నీటిని దాటాడు. ఈ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అదికాస్త స్వాతి లక్రా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే దీనికి క్యాప్షన్ పెట్టండి అంటూ.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట చేసింది. దీంతో ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. అదిచూసి స్పందిస్తున్న నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘మనసుంటే మార్గం ఉంటుంది(Where there is a will there's a way)’ అని ఒకరంటే.. ‘గోడుంటే చాలు మార్గం ఉంటుంది (Where there is a 'Wall', there is a Way)’ అని మరొకరు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి