Viral Video: పైథాన్‌లతో ఏంటి ఈ పిచ్చి పనులు.. ఎంత ధైర్యం ఉంటే మాత్రం ఇంత అతి అవసరమా!

ABN , First Publish Date - 2022-04-30T21:38:47+05:30 IST

చిన్నపాటి పాములు కనిపిస్తే సాధారణంగా ఆమడ దూరం పరిగెడతాం కదా. కానీ ఓ వ్యక్తి మాత్రం భారీ సాహసం చేశాడు. ఏకంగా రెండు భారీ కొండ చిలువలతో అతడు చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు ర

Viral Video: పైథాన్‌లతో ఏంటి ఈ పిచ్చి పనులు.. ఎంత ధైర్యం ఉంటే మాత్రం ఇంత అతి అవసరమా!

ఇంటర్నెట్ డెస్క్: చిన్నపాటి పాములు కనిపిస్తే సాధారణంగా ఆమడ దూరం పరిగెడతాం కదా. కానీ ఓ వ్యక్తి మాత్రం భారీ సాహసం చేశాడు. ఏకంగా రెండు భారీ కొండ చిలువలతో అతడు చేసిన పని ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అది చూసి నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. కాగా.. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..



కొండ చిలువలకు విషం ఉండదు. కానీ అవి మనుషులను అమాంతం మింగేసి ప్రాణాలు తీస్తాయి. ఈ భారీ సర్పాలను చూస్తే ఎవరికైన వెన్నులో వణుకు పుడుతుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం ఏకంగా రెండు కొండ చిలువలతో భారీ సాహసం చేశాడు. ఇండోనేషియాకు చెందిన ఓ వ్యక్తి.. రెండు కొండ చిలువలను భుజాలపై వేసుకుని స్టెప్పులేశాడు. అంతేకాకుండా ఆ దృశ్యాలను వీడియో తీశాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ‘పైథాన్‌లతో ఏంటి ఈ పిచ్చిపనులు’ అని కొందరు కామెంట్ చేస్తే మరికొందరేమో అతడి ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటూ సెల్యూట్ చేస్తున్నారు.




Updated Date - 2022-04-30T21:38:47+05:30 IST