రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

ABN , First Publish Date - 2021-01-24T05:50:24+05:30 IST

జిల్లా కేంద్రానికి సమీపాన నెల్లిమర్ల రైల్వేస్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు శ్రీకాకుళం జీఆర్‌పీ ఎస్‌ఐ చెల్లూరు శ్రీనివాసరావు తెలిపారు.

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి దుర్మరణం

విజయనగరం క్రైం : జిల్లా కేంద్రానికి సమీపాన నెల్లిమర్ల రైల్వేస్టేషన్‌ పరిధిలో శనివారం ఉదయం రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందినట్టు శ్రీకాకుళం జీఆర్‌పీ ఎస్‌ఐ చెల్లూరు శ్రీనివాసరావు తెలిపారు. మృతుడి వయసు సుమారు 40 ఏళ్లు ఉంటాయని, గెడ్డం, లేత నీలం రంగు గీతల షర్టు, సిమెంట్‌ రంగు నిక్కర్‌, పచ్చపూలు రంగు లుంగీ ధరించినట్టు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు 9490727521 ఫోన్‌ నెంబరులో సంప్రదించాలని కోరారు. 

గూడ్స్‌ రైలు ఢీకొని పశువుల కాపరి... 

శృంగవరపుకోట రూరల్‌ (జామి) : భీమసింగి రైల్వే ట్రాక్‌పై గూడ్స్‌ రైలు ఢీకొని అదే గ్రామానికి చెందిన సీహెచ్‌ రాజు(33) మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం... రాజు ప్రతిరోజూ ఈ ప్రాంతంలోకి పశువులను మేతకు తెస్తుంటాడని, ఈ క్రమంలో ట్రాక్‌ దాటుతుండగా గూడ్స్‌రైలు ఢీకొంది. ఈ ఘటనపై విజయనగరం రైల్వేపోలీసులతో పాటు జామి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గాయపడిన వ్యక్తి మృతి

డెంకాడ : గుణుపూరుపేట వద్ద ఈ నెల 20వ తేదిన జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సరగడ శ్రీను (36) మృతి చెందినట్టు హెచ్‌సీ రమణ తెలిపారు. పూసపాటిరేగ మండలం భరణికం గ్రామానికి చెందిన శ్రీను తన బావ మరిది కొంతల రాముతో కలిసి ఈ నెల 20న ద్విచక్ర వాహ నంపై విజయనగరం వెళ్తుండగా లగేజ్‌ వ్యాన్‌ను వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో శ్రీను తీవ్రంగా గాయపడ గా, రాము స్వల్పగాయాలతో బయటపడ్డాడు. కాగా శ్రీనుకి తొలుత జిల్లా కేంద్రా సుపత్రిలో చికిత్స అందించగా... మెరుగైన వైద్యం కోసం విశాఖ కేజీహెచ్‌కు తర లించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్టు హెచ్‌సీ తెలిపారు. ఈ ఘనటపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 

Updated Date - 2021-01-24T05:50:24+05:30 IST