Tragedy news: విధి వక్రించడం అంటే ఇదేనేమో.. అప్పటిదాకా బాగున్న వ్యక్తి.. ఉన్నట్టుండి ఉడుకుతున్న గంజిలో పడి..

ABN , First Publish Date - 2022-08-04T02:53:13+05:30 IST

మృత్యువు ఎప్పుడు, ఎటు వైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేం.. అంటూ పెద్దలు అంటుంటారు. అందుకు తగ్గట్లుగానే కొందరు అప్పటిదాకా బాగుండి.. ఉన్నట్టుండి మృత్యు..

Tragedy news: విధి వక్రించడం అంటే ఇదేనేమో.. అప్పటిదాకా బాగున్న వ్యక్తి.. ఉన్నట్టుండి ఉడుకుతున్న గంజిలో పడి..

మృత్యువు ఎప్పుడు, ఎటు వైపు నుంచి వస్తుందో ఎవరూ చెప్పలేం.. అంటూ పెద్దలు అంటుంటారు. అందుకు తగ్గట్లుగానే కొందరు అప్పటిదాకా బాగుండి.. ఉన్నట్టుండి మృత్యు ఒడిలోకి జారుకోవడం తరచూ చూస్తూనే ఉన్నాం. అనారోగ్య సమస్యలతో కొందరు.. ప్రమాదాల బారిన పడి కొందరు కానరాని లోకాలకు చేరుకుంటుంటారు. తద్వారా కన్నవాళ్లకు కన్నీళ్లు మిగుల్చుతుంటారు. తమిళనాడులో తాజాగా ఓ విషాద ఘటన (Tragic incident) చోటు చేసుకుంది. గ్రామ దేవత ఉత్సవాల్లో పాల్గొన్న ఓ భక్తుడు.. అనుకోని విధంగా ఉడుకుతున్న గంజిలో పడి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..


తమిళనాడు (Tamil Nadu) లోని మధురై పరిధి పలంగానట్టిలో ఈ ఘటన చోటు చేసుకుంది. జూన్ 29న స్థానికంగా గ్రామ దేవత ఒడ్డు మారియమ్మ ఉత్సవాలను (celebrations) వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నదానం చేసేందుకు వంటలు చేస్తున్నారు. అలాగే పెద్ద పెద్ద గిన్నెల్లో గంజిని కూడా వండుతున్నారు. ఆ సమయంలో ఓ వ్యక్తి వంటలను పర్యవేక్షించేందుకు అక్కడికి వస్తాడు. ఆ సమయంలో అతడు ఉన్నట్టుండి కళ్లు తిరిగి పడిపోతుంటాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న గంజి గిన్నెను పట్టుకుంటాడు. అయితే తర్వాత పూర్తిగా స్పృహ కోల్పోవడంతో ఉడుకుతున్న గంజిలో పడిపోతాడు.

young man cheated the girl: అమ్మాయి పేరుతో యువతికి దగ్గరైన యువకుడు.. ఓ రోజు నేరుగా ఆమె వద్దకు వెళ్లి దుస్తులు చించుకుని.. చివరకు..


అక్కడే ఉన్న వారు గమనించి, కాపాడే ప్రయత్నం చేస్తారు. అయితే గంజి బాగా వేడిగా ఉండడంతో సాధ్యం కాదు. చివరకు గిన్నె ఒక వైపునకు ఒరగడంతో కింద పడిపోతాడు. అప్పటికే అతను పూర్తిగా కాలిపోతాడు. అయినా పైకి లేచి పక్కకు వెళ్లిపోయి పడిపోతాడు. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tamil Nadu News: యువతిపై కన్నేసిన కాలేజ్ క్యాంటిన్ వర్కర్.. ఒంటరిగా వెళ్తుండగా కాపుకాసి మరీ.. చివరకు బాధితురాలి స్నేహితురాలి చొరవతో..



Updated Date - 2022-08-04T02:53:13+05:30 IST