janagama: అయ్యోపాపం.. పండుగ పూట ఎంత ఘోరం జరిగిందో...

ABN , First Publish Date - 2021-10-15T17:19:05+05:30 IST

సద్దుల బతుకమ్మ పూల కోసం వెళ్లి, ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పౌడి తంగెడు చెట్టుఎక్కి, దాని పైనుంచి ప్రమాదవశాత్తు పడి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని

janagama: అయ్యోపాపం.. పండుగ పూట ఎంత ఘోరం జరిగిందో...

 - బతుకమ్మ పూల కోసం వెళ్లి..

 - చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి

 - స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం చాగల్‌లో ఘటన


స్టేషన్‌ఘన్‌పూర్‌(జనగామ): సద్దుల బతుకమ్మ పూల కోసం వెళ్లి, ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. పౌడి తంగెడు చెట్టుఎక్కి, దాని పైనుంచి ప్రమాదవశాత్తు పడి మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని ఛాగల్‌లో బుధవారం రాత్రి చోటు చేసుకొంది. గురువారం ఉదయం గ్రామస్థులు, పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఛాగల్‌ గ్రామానికి చెందిన సుంచు వెంకటేశ్వర్లు (50) అనేవ్యక్తి బతుకమ్మ పూల కోసం బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి అయినప్పటికి ఇంటికి రాకపోవడంతో.. కుటుంబ సభ్యులు వెంకటేశ్వర్లు సెల్‌కు ఫోన్‌ చేసినప్పటికి లిప్టు చేయకపోవడంతో గ్రామస్థులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో గ్రామశివారులోని చెట్ల పొదలచుట్టూ వెతుకగా, పౌడి తంగేడు చెట్టు రెండు కొమ్మల మధ్య చిక్కుకొని మృతిచెందినట్లు రాత్రి 11 గంటల ప్రాంతంలో గమనించారు. పూలు కోయడానికి చెట్టు పైకిఎక్కి కోస్తున్న క్రమంలో కొమ్మలు విరిగాయి. దీంతో చెట్టు పైనుంచి కిందపడి వెంకటేశ్వర్లు అక్కడక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో గ్రామస్థుల సహకారంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. ఈ ఘటనతో ఛాగల్‌లో విషాదం నెలకొంది. వెంకటేశ్వర్లుకు భార్య పద్మ, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు.

Updated Date - 2021-10-15T17:19:05+05:30 IST