‘కొవిడ్‌ పార్టీ’తో ప్రాణాలు కోల్పోయిన‌ వ్యక్తి.. యూఎస్‌లో..

ABN , First Publish Date - 2020-07-14T13:10:23+05:30 IST

అమెరికాలో.. మూర్ఖత్వం తాండవిస్తోంది. కరోనా ఒట్టి బూటకమని, అసలు అది నిజమో కాదో తేలుస్తామంటూ పలు చోట్ల ‘కొవిడ్‌ పార్టీ’లను నిర్వహిస్తున్నారు.

‘కొవిడ్‌ పార్టీ’తో ప్రాణాలు కోల్పోయిన‌ వ్యక్తి.. యూఎస్‌లో..

న్యూయార్క్‌, జూలై 13: అమెరికాలో.. మూర్ఖత్వం తాండవిస్తోంది. కరోనా ఒట్టి బూటకమని, అసలు అది నిజమో కాదో తేలుస్తామంటూ పలు చోట్ల ‘కొవిడ్‌ పార్టీ’లను నిర్వహిస్తున్నారు. అలాంటి ఓ పార్టీకి హాజరైన వ్యక్తి(30) న్యూయార్క్‌లోని లెనోక్స్‌ హిల్‌ ఆస్పత్రిలో కరోనాతో మృతిచెందాడు. ‘‘కరోనా నిజం కాదనుకున్నాను. కానీ వైరస్‌ ఉండటం నిజమే. పార్టీకి వెళ్లి నేను తప్పు చేశాను’’ అని నర్సుతో పలికిన మాటలే అతడికి చివరివి. ఇటువంటి నిర్లక్ష్యంతో సమాజానికి ప్రమాదకరంగా మారద్దంటూ వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - 2020-07-14T13:10:23+05:30 IST