భార్య చీర సరిగా కట్టుకోలేదని భర్త ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-05-18T00:36:37+05:30 IST

భార్యభర్తల మధ్య మనస్పర్థలు, కలహాలు సహజమే. ఒకరి ప్రవర్తన ఒకరికి నచ్చకుంటే.. నొప్పించకుండా చెప్పుకుని మార్పును ఆశించాలి.

భార్య చీర సరిగా కట్టుకోలేదని భర్త ఆత్మహత్య

ఔరంగాబాద్ : భార్యభర్తల మధ్య మనస్పర్థలు, కలహాలు సహజమే. ఒకరి ప్రవర్తన ఒకరికి నచ్చకుంటే.. నొప్పించకుండా మాట్లాడి మార్పును ఆశించాలి. కానీ ఒకనొకరు అర్థం చేసుకోకుండా ఆవేశాలకుపోతే అనర్థాలు అనివార్యమవుతాయి. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ ఘటన ఈ వాదనను బలపరుస్తోంది. భార్య చీర సరిగా కట్టుకోవడంలేదని, నడక, నడవడిక మంచిగాలేవనే కారణంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన భార్య విషయంలో ఏమాత్రం సంతోషంగా లేనని చెబుతూ ఓ సూసైడ్ లెటర్ రాసి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి పేరు సమాధాన్ సబ్లే, అతడి వయసు 24 ఏళ్లు అని పోలీసులు వెల్లడించారు. తనకంటే 6 సంవత్సరాలు చిన్నదైన యువతిని  వివాహమాడాడని వివరించారు. ఈ మేరకు మృతుడి గదిలో సూసైడ్ లెటర్ లభ్యమైందని ముకుంద్వాడీ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జీ బ్రహ్మగిరి తెలిపారు. ఆరు నెలల క్రితమే వీరి పెళ్లి జరిగిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని వివరించారు.

Updated Date - 2022-05-18T00:36:37+05:30 IST