Maharashtra: పాల్ఘర్ జిల్లాలో విషాదం అంతాఇంతా కాదు..కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే..

ABN , First Publish Date - 2022-10-03T23:31:32+05:30 IST

మహారాష్ట్రలోని విరార్ జిల్లా పాల్ఘర్‌‌ (palghar) లో పండుగ సంబరాల్లో విషాదం చోటుకుంది. గార్బా నృత్యం చేస్తూ మనీష్..

Maharashtra: పాల్ఘర్ జిల్లాలో విషాదం అంతాఇంతా కాదు..కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే..

ముంబై: మహారాష్ట్రలోని విరార్ జిల్లా పాల్ఘర్‌‌ (palghar) లో పండుగ సంబరాల్లో విషాదం చోటుకుంది. గార్బా నృత్యం చేస్తూ మనీష్ నారప్‌జీ అనే యువకుడు (35) కుప్పకూలి ఆసుపత్రిలో కన్నుమూయగా, కొడుకు మరణ వార్త విని తట్టుకోలేక అతని తండ్రి (66) ప్రాణాలు వదిలేశాడు. దీంతో నారప్‌జీ కుటుంబంలో విషాదం నిండుకుంది. 


విరార్‌లోని గ్లోబల్ సిటీ కాంప్లెక్స్‌లో గార్బా ఈవెంట్‌లో పాల్గొన్న నారప్‌జీ ఎంతో ఉత్సాహంగా డాన్స్ చేస్తూ స్టేజ్‌పైనే కుప్పకూలిపోయాడు. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే నారప్‌జీ కన్నుమూశాడు. తన కళ్లముందే కొడుకు చనిపోవడం తట్టుకోలేని నారప్‌జీ తండ్రి అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో అతను సైతం కన్నుమూసినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో  తండ్రీకొడుకుల మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం పంపి యాక్సిడెంటల్ డెత్‌గా పోలీసులు కేసు నమోదు  చేశారు.

Updated Date - 2022-10-03T23:31:32+05:30 IST