సలసలా మరుగుతున్న నూనెలో చేతిని ముంచి చికెన్ పీస్‌లు తీస్తున్నాడు.. నివ్వెరపోతున్న జనాలు..

ABN , First Publish Date - 2021-11-09T16:42:33+05:30 IST

వేడి వేడి నూనె మీద పడితే మంటతో విలవిలలాడిపోతాం.

సలసలా మరుగుతున్న నూనెలో చేతిని ముంచి చికెన్ పీస్‌లు తీస్తున్నాడు.. నివ్వెరపోతున్న జనాలు..

వేడి వేడి నూనె మీద పడితే మంటతో విలవిలలాడిపోతాం. అలాంటిది సలసలా మరుగుతున్న నూనెలో చేయి పెడితే ఎలా ఉంటుంది? చర్మం ఊడి వచ్చేస్తుంది. అయితే ఓ వ్యక్తి సలసలా మరుగుతున్న నూనెలో చేతిని ముంచి చులాగ్గా చికెన్ పీస్‌లు తీసేస్తున్నాడు. నవ్వుతూ సంతోషంగా ఆ పని చేస్తున్నాడు. అతడిని చూసిన వారందరూ ఆశ్చర్యంతో నోరు వెళ్లబెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


ఈ వీడియో ఇప్పటికి 13 లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. 41 వేలకు పైగా లైక్స్ సాధించింది. ఆ వ్యక్తి ఏదో ట్రిక్ ఉపయోగించి అలా చేస్తున్నాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు. `చికెన్‌తో పాటు అతడి చర్మం కూడా రుచి చూడాలనుకుంటే అక్కడికి వెళ్లి తినొచ్చ`ని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. చేతులు కాలకుండా ఉండేందుకు ఆ వ్యక్తి ఏదో రసాయనం రాసుకున్నాడని, అది నూనెలో కలిసి తినే వారి శరీరంలోకి ప్రవేశిస్తుందని ఓ వ్యక్తి హెచ్చరించాడు. ఏదేమైనా ఈ వీడియో చూసేవారిని షాక్‌కు గురి చేస్తోంది. 



Updated Date - 2021-11-09T16:42:33+05:30 IST