13 సంవత్సరాల్లో మూడు వివాహాలు.. మొదటి భార్యకు విడాకులు, రెండో భార్య హత్య.. మూడో భార్యను ఏం చేశాడంటే..

Published: Sun, 27 Mar 2022 00:13:18 ISTfb-iconwhatsapp-icontwitter-icon
13 సంవత్సరాల్లో మూడు వివాహాలు.. మొదటి భార్యకు విడాకులు, రెండో భార్య హత్య.. మూడో భార్యను ఏం చేశాడంటే..

పోలీసులకు రహదారిపై ఒక సగం కాలిన మహిళ శవం దొరికింది. మృతురాలి గురించి తెలుసుకునేందుకు పోలీసులు ఆ శవం ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో చనిపోయిన మహిళ గుర్తింపు తెలిసింది. ఆమె గురించి పూర్తి వివరాల కోసం చేపట్టిన దర్యాప్తులో ఒక మోసగాడి వ్యవహారం బయటపడింది.


వివరాల్లోకి వెళితే.. ఛత్తీస్ గఢ్‌లోని కంకేర్ జిల్లాలో ఒక హైవేపై పోలీసులకు ఒక మహిళ మృతదేహం దొరికింది. ఆ శవం సగం కాలిన స్థితిలో ఉంది. మృతురాలి గుర్తింపు తెలుసుకోవడానికి పోలీసులు ఆ శవం ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో మృతురాలి పేరు పూర్ణిమా దేవి అని తెలిసింది. 


పూర్ణిమా దేవి గురించి దర్యప్తు చేయగా.. పోలీసులకు ఆమె భర్త తులసీ దాస్ బండారం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. తులసీదాస్ గత 13 సంవత్సరాలలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటిసారి 2009లో అతను ఒక మహిళను పెళ్లికున్నాడు. అయిదు సంత్సరాల తరువాత 2014లో తులసీదాస్ ఆమెకు విడాకులిచ్చాడు. ఆ తరువాత పూర్ణిమా దేవిని వివాహం చేసుకున్నాడు. తులసీదాస్, పూర్ణిమా దేవిల దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో 2020లో తులసీదాస్ ఇంద్రాణి అనే మరో యువతి ప్రేమలో పడ్డాడు. 


కొంతకాలం తరువాత ఆ విషయం పూర్ణిమా దేవికి తెలయడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో 2021 డిసెంబర్‌లో తులసీదాస్ తన ప్రియురాలు ఇంద్రాణిని వివాహం చేసుకున్నాడు. దీంతో పూర్ణిమా దేవి ఇల్లు వదిలి వెళ్లిపోయింది. భర్తపై కేసు వేస్తానని బెదిరించింది. 


పూర్ణిమా దేవి బెదిరింపులతో భయపడ్డ తులసిదాస్ తన మూడో భార్య ఇంద్రాణితో కలిసి ఒక ప్లాన్ వేశాడు. ప్లాన్ ప్రకారం తులసీ దాస్ తన భార్య పూర్ణిమా దేవి పుట్టింటికి వెళ్లి ఆమెను కలిశాడు. ఇకపై ఇంద్రాణితో ఉండనని.. పూర్ణిమా దేవితోనే ఉంటానని మాయ మాటలు చెప్పి.. ఆమెను అక్కడి నుంచి తన ఇంటికి తీసుకొచ్చాడు. ఇంట్లో ముందుగానే ఇంద్రాణి దాగి ఉంది. ఆ తరువాత తులసీ దాస్, ఇంద్రాణి కలిసి పూర్ణిమా దేవి గొంతు నులిమి హత్య చేశారు. ఆ తరువాత శవాన్ని కారులో ఊరి చివర తీసుకెళ్లి హైవే పక్కన పెట్రోల్ పోసి నిప్పంటించారు.


ప్రస్తుతం పోలీసులు తులసీదాస్, ఇంద్రాణిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.