US Police: బ్యాంకులోకి ఆ గెటప్‌లో వచ్చిన వ్యక్తి... ఎవరూ అనుమానించకపోవడం చూసి ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2022-07-21T17:07:39+05:30 IST

అమెరికాలోని జార్జియాలో వృద్ధురాలి...

US Police: బ్యాంకులోకి ఆ గెటప్‌లో వచ్చిన వ్యక్తి... ఎవరూ అనుమానించకపోవడం చూసి ఏం చేశాడంటే...

అమెరికాలోని జార్జియాలో వృద్ధురాలి వేషధారణలో బ్యాంకును దోచుకున్నట్లు అనుమానిస్తున్న వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అట్లాంటాలోని హెన్రీ కౌంటీలో ఈ ఘటన చోటుచేసుకుందని మెక్‌డొనఫ్ పోలీసులు సోషల్ మీడియాలో తెలిపారు. అనుమానితుడు ఆరడుగుల పొడవు కలిగివుండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దోపిడీ చేసే సమయంలో అతను పూల డిజైన్ కలిగిన దుస్తులు, తెల్లటి స్నీకర్లు, తెల్లటి విగ్ ధరించి ముఖానికి ముసుగు వేసుకున్నాడు. 


ఈ వ్యక్తి మెక్‌డొనఫ్ నగరంలోని చేజ్ బ్యాంక్‌లో దోపిడీకి పాల్పడ్డాడు. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, సిబ్బందికి తుపాకీ చూపించాడని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. డబ్బును తీసుకున్నాక అనుమానితుడు తెలుపురంగు ఎస్‌యూవీలో వెళ్లిపోయాడు. ఛేజ్ బ్యాంక్‌లో దోపిడీకి పాల్పడిన వ్యక్తి  పరారీలో ఉన్నట్లు మెక్‌డొనఫ్ పోలీసులు తెలిపారు. వృద్ధురాలి వేషంలో ఉన్న వ్యక్తి చిత్రాలను వారు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వింత ఘటనపై ఇంటర్నెట్ వినియోగదాలు రరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్ "ఇక్కడ తమాషా ఏమిటంటే, అతని వింత గెటప్‌ను ఎవరూ  ప్రత్యేకంగా చూడలేదు’’ అని పేర్కొన్నాడు. మరొక యూజర్ ‘ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడం ఉపశమనం కలిగించే అంశం’ అని పేర్కొన్నాడు. 

Updated Date - 2022-07-21T17:07:39+05:30 IST