భార్యలా వేషం వేసి.. విమానం ఎక్కేసిన కరోనా పేషెంట్!

ABN , First Publish Date - 2021-07-23T07:53:58+05:30 IST

కరోనా సోకిన వాళ్లు తామే బాధ్యత తీసుకొని క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలి. అంతేకానీ బయట తిరుగుతూ మిగతా ప్రజలకు ప్రాణాపాయం కలిగించకూడదు. ఇది ప్రపంచ దేశాలన్నీ ప్రజలకు చేస్తున్న సూచన.

భార్యలా వేషం వేసి.. విమానం ఎక్కేసిన కరోనా పేషెంట్!

ఇండోనేషియా: కరోనా సోకిన వాళ్లు తామే బాధ్యత తీసుకొని క్వారంటైన్‌లోకి వెళ్లిపోవాలి. అంతేకానీ బయట తిరుగుతూ మిగతా ప్రజలకు ప్రాణాపాయం కలిగించకూడదు. ఇది ప్రపంచ దేశాలన్నీ ప్రజలకు చేస్తున్న సూచన. కానీ ఒక వ్యక్తి మాత్రం దీనికి భిన్నంగా ప్రవర్తించాడు. తనకు కరోనా సోకిన విషయం అందరికీ తెలియడంతో.. అందర్నీ మోసం చేయాలని అతను ప్లాన్ వేశాడు. చక్కగా తన భార్య దుస్తులు ధరించి, మొహం కనిపించకుండా నికాబ్ వేసుకొని, ఆమెలా నటిస్తూ ఏకంగా విమానం ఎక్కేశాడు. దీనికోసం నకిలీ ఐడీ, నెగిటివ్ పీసీఆర్ టెస్టు ఫలితాన్ని కూడా వెంట తీసుకొచ్చాడు. విమాన సిబ్బందికి చెందిన ఒక అటెండెంట్.. లావెటరీలో అతను దుస్తులు మార్చుకోడం చూడటంతో అతని బండారం బట్టబయటైంది. అతన్ని అరెస్టు చేసిన పోలీసులు వెంటనే కరోనా టెస్టు చేయించగా పాజిటివ్ ఫలితమే వచ్చింది. ఈ ఘటన జకార్తా-టెర్నేట్ సిటీలింక్ విమానంలో వెలుగు చూసింది. సదరు వ్యక్తిని ఇండోనేషియాకు చెందిన వాడిగా గుర్తించారు.

Updated Date - 2021-07-23T07:53:58+05:30 IST