Bengaluru: ఉద్యోగం కోసం వినూత్న ప్రయత్నం.. ఫుడ్‌ బాక్స్‌లో రెజ్యూమ్..

ABN , First Publish Date - 2022-07-07T00:12:42+05:30 IST

కోవిడ్ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులు భారీగా పెరిగారు.

Bengaluru: ఉద్యోగం కోసం వినూత్న ప్రయత్నం.. ఫుడ్‌ బాక్స్‌లో రెజ్యూమ్..

కోవిడ్ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగులు భారీగా పెరిగారు. ఈ నేపథ్యంలో ఓ యువకుడు ఉద్యోగం కోసం వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నాడు. తన బయోడేటా డస్ట్‌బిన్‌ల పాలు కాకుండా ఉండేందుకు మంచి స్కెచ్ వేశాడు. Zomato ఎగ్జిక్యూటివ్‌గా మారి ఒక పేస్ట్రీ బాక్స్‌లో స్వీట్స్‌తో సహా రెజ్యూమ్‌ను కంపెనీలకు పంపుతున్నాడు. `దాదాపు అన్ని రెజ్యూమ్‌లు డస్ట్ బిన్ పాలవుతాయి. కానీ నా రెజ్యూమ్ మాత్రం మీ కడుపులోకి చేరుతుంది` అని కామెంట్ కూడా రాస్తున్నాడు. ఆ విషయాన్ని తనే స్వయంగా ట్విటర్ ద్వారా తెలియజేశాడు. 


ఇది కూడా చదవండి..

Viral video: కొడుకు ప్రోగ్రస్ కార్డు చూసి గుక్కపెట్టి ఏడ్చిన తండ్రి.. ఏడాది పాటు ట్యూషన్ పెట్టిస్తే ఆ కుర్రాడికి వచ్చిన మార్కులు ఎన్నంటే.


జైపూర్‌కు చెందిన అమన్ ఖండేవాలా అనే యువకుడు ఈ ఏడాది పుణె కాలేజీలో M.B.A. (Finance) పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం దొరకడం మాత్రం చాలా కష్టంగా మారింది. దీంతో శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన లూకాస్ అనే వ్యక్తి నుంచి స్ఫూర్తి పొంది ఫుడ్ బాక్స్‌తో పాటు తన రెజ్యూమ్‌ను కూడా కంపెనీలకు పంపడం ప్రారంభించాడు. `ఈ ఐడియాను అమలు చేయడానికి బెంగళూరు సరైన చోటని నాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ నేను పనిచేయాలనుకుంటున్న కంపెనీలు ఉన్నాయి. పైగా, ఇలాంటి క్రియేటివిటీని అక్కడ బాగా ఆదరిస్తార`ని అమన్ పేర్కొన్నాడు. 


`బెంగళూరులోని పలు కంపెనీల సెక్యూరిటీ గార్డులకు పైనాపిల్ పేస్ట్రీ బాక్సులు ఇచ్చేవాడిని. లోపల పేస్ట్రీతో పాటు నా రెజ్యూమ్ కూడా ఉంచేవాడిని. ప్యాకెట్ మీద ఆ సంస్థ హెచ్‌ఆర్ మేనేజర్ల అడ్రస్ రాసేవాడిని. ఒక్కో బాక్సుకు రూ.400 మాత్రమే ఖర్చు అయ్యేద`ని అమన్ చెప్పాడు. ఆ విషయం గురించి ట్విటర్‌లో పోస్ట్ చేశాక అమన్‌కు రెండ్రోజుల్లోనే ఏడు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయట. 

Updated Date - 2022-07-07T00:12:42+05:30 IST