గల్లంతైన అప్పలనాయుడు (ఫైల్ ఫొటో)
మునగపాక, జనవరి 16 : గణపర్తి గ్రామం వద్ద శారదా నది పెద్ద బ్రిడ్జి సమీపంలో శనివారం కాలు జారిపడి గారా అప్పలనాయుడు (42) గల్లంతయ్యాడు. ఉదయం నుంచి నదిలో గిలిస్తున్నప్పటికీ ఆచూకీ కానరాలేదు. అతనికి భార్య, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.