మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు.. ఆమె పెళ్లి గురించి ఒత్తిడి చేయడంతో ఎంత పని చేశాడంటే..

ABN , First Publish Date - 2022-05-11T09:12:57+05:30 IST

ఆ యువకుడు తన మాయ మాటలతో ఓ బాలికను వలలో వేసుకున్నాడు.. ప్రేమిస్తున్నానని చెప్పి ఆ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు.. ఎన్నోసార్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది.. ఆ యువకుడిపై పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చింది..

మైనర్ బాలికను గర్భవతిని చేసిన యువకుడు.. ఆమె పెళ్లి గురించి ఒత్తిడి చేయడంతో ఎంత పని చేశాడంటే..

ఆ యువకుడు తన మాయ మాటలతో ఓ బాలికను వలలో వేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పి ఆ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఎన్నోసార్లు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. ఆ యువకుడిపై పెళ్లి కోసం ఒత్తిడి తెచ్చింది.. దీంతో భయపడిన యువకుడు ఆ బాలికను అత్యంత దారుణంగా హతమార్చాడు.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. 


ఘజియాబాద్‌లోని ఓ ప్రాంతానికి చెందిన యువకుడు తన మాయ మాటలతో అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను వలలో వేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి ఆ బాలికపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది. తను ప్రెగ్నెంట్ అయ్యానని చెప్పి పెళ్లి చేసుకుందామని ఆ యువకుడిపై ఒత్తిడి తెచ్చింది. ఆ బాలికను పెళ్లి చేసుకోవడం ఆ యువకుడికి ఇష్టం లేదు. అందుకే ఆమెను ఎలాగైనా అడ్డు తప్పించాలనుకున్నాడు. 


గత నెల 30న ఆ బాలికకు ఫోన్ చేసి ఒక చోటకు రమ్మన్నాడు. అక్కడ ఆ బాలిక గొంతును కత్తితో కోసేశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆ బాలిక అక్కడికక్కడే మరణించింది. నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తర్వాతి రోజు బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ప్రేమికుడిపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అతడు నేరం అంగీకరించాడు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 


Read more