క్వారంటైన్ నుంచి తప్పించుకోవడానికి.. ఇతనేం చేశాడో చూడండి!

ABN , First Publish Date - 2021-07-22T10:36:38+05:30 IST

ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి పేరు చెబితే వణుకుతోంది. ఈ క్రమంలో విదేశాల నుంచి తమ దేశాలకు వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉండాలని పలుదేశాలు ఆదేశించాయి.

క్వారంటైన్ నుంచి తప్పించుకోవడానికి.. ఇతనేం చేశాడో చూడండి!

కాన్‌బెర్రా: ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారి పేరు చెబితే వణుకుతోంది. ఈ క్రమంలో విదేశాల నుంచి తమ దేశాలకు వచ్చిన వారిని క్వారంటైన్‌లో ఉండాలని పలుదేశాలు ఆదేశించాయి. వీటిలో ఆస్ట్రేలియా కూడా ఒకటి. వేరే దేశాల నుంచి ఆస్ట్రేలియా వచ్చిన వారిని 14 రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచాలని ఆ దేశం నిబంధన విధించింది. వీటిని ఎవరూ ఉల్లంఘించకుండా కఠిన చర్యలు కూడా తీసుకుంటోంది. ఇలాగే క్వారంటైన్‌లో ఉన్న ఒక వ్యక్తి.. తాను ఉన్న హోటల్ నుంచి పారిపోవడానికి మంచి ప్లాన్ వేశాడు. గదిలో ఉన్న దుప్పట్లన్నీ కలిపి, పెద్ద తాడులా చేసి వాటితో నాలుగో అంతస్తు నుంచి కిందకు దిగేశాడు. ఆ తర్వాత ఎంచక్కా బయటకు పారిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి అతన్ని అరెస్టు చేశారట.

Updated Date - 2021-07-22T10:36:38+05:30 IST