పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 72 ఏళ్ల వృద్ధురాలు చెప్పింది విని నోరెళ్లబెట్టిన పోలీసులు.. 75 ఏళ్ల భర్త బాధ కూడా విని..

ABN , First Publish Date - 2022-05-30T20:03:53+05:30 IST

ఆమె వయసు 72 సంవత్సరాలు.. ఆమె భర్త వయసు 75 ఏళ్లు.. దాదాపు 50 ఏళ్లు పైబడిన వైవాహిక జీవితం వారిది..

పోలీస్ స్టేషన్‌కు వచ్చిన 72 ఏళ్ల వృద్ధురాలు చెప్పింది విని నోరెళ్లబెట్టిన పోలీసులు.. 75 ఏళ్ల భర్త బాధ కూడా విని..

ఆమె వయసు 72 సంవత్సరాలు.. ఆమె భర్త వయసు 75 ఏళ్లు.. దాదాపు 50 ఏళ్లు పైబడిన వైవాహిక జీవితం వారిది.. ఇటీవల ఆ వృద్ధురాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్తపై ఫిర్యాదు చేసింది.. భర్త తనను ప్రేమించడం లేదని, తనను సరిగ్గా చూసుకోవడం లేదని తెలిపింది.. ఆస్థి అంతా కొడుకు, కోడలికి ఇచ్చేసి తనకేం లేకుండా చేశాడని ఫిర్యాదు చేసింది.. పోలీసుల పిలుపు మేరకు స్టేషన్‌కు చేరుకున్న 75 ఏళ్ల భర్త కూడా తన బాధలు చెప్పుకున్నాడు.. పోలీసులు ఇద్దరి మధ్య రాజీ కుదిర్చి ఇంటికి పంపించారు. 


ఇది కూడా చదవండి..

నా భర్తకు లోపం ఉంది.. నన్ను దగ్గరకు కూడా రానివ్వడం లేదు.. పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు!


ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌కు చెందిన ఓ 72 ఏళ్ల వృద్ధురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని తన భర్తపై ఫిర్యాదు చేసింది. 75 ఏళ్ల భర్త తనను ప్రేమించడం లేదని ఆరోపించింది. కొడుకు, కోడలు చెప్పిందే వింటాడని, ఆస్థి అంతా వారికే ఇచ్చేశాడని పేర్కొంది. చిన్న చిన్న ఖర్చులకు కూడా తనకు డబ్బులు ఇవ్వరని తెలిపింది. దీంతో పోలీసులు ఆమె భర్తను పిలిపించారు. తన భార్య ఇంట్లో ఎవరితోనూ సఖ్యంగా ఉండదని, అందరితోనూ గొడవలు పడుతుందని, తనను కూడా తిడుతుందని చెప్పాడు. 


వారి వాదనలు విన్న పోలీసులు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారు. వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉండాలని నచ్చ చెప్పారు. దీంతో వృద్ధ దంపతులు రాజీ పడ్డారు. పోలీసుల ఎదుట ఆ వృద్ధుడు తన భార్యకు గులాబీ పువ్వు ఇచ్చి `నేను నిన్ను ప్రేమిస్తున్నాను` అని చెప్పాడు. అదే సమయంలో, వృద్ధురాలు తన భర్త పాదాలను మూడుసార్లు తాకి, `నన్ను బాగా చూసుకో` అని చెప్పింది. ఆ తర్వాత ఆ వృద్ధ దంపతులు నవ్వుకుంటూ ఇంటికి వెళ్లిపోయారు.

Updated Date - 2022-05-30T20:03:53+05:30 IST