Wedding వేడుకలో వరుడు డుమ్మా...అత్తమామల ఇంటి ముందు వధువు ధర్నా

ABN , First Publish Date - 2022-03-09T13:43:34+05:30 IST

సైనికుడిగా పనిచేస్తున్న వరుడు వివాహ వేడుకకు డుమ్మా కొట్టిన ఘటన రాజస్ధాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది....

Wedding వేడుకలో వరుడు డుమ్మా...అత్తమామల ఇంటి ముందు వధువు ధర్నా

 జైపూర్ (రాజస్థాన్): సైనికుడిగా పనిచేస్తున్న వరుడు వివాహ వేడుకకు డుమ్మా కొట్టిన ఘటన రాజస్ధాన్ రాష్ట్రంలోని భరత్‌పూర్ జిల్లాలో వెలుగుచూసింది.మధుర నగరంలోని సైనిక విభాగంలో జవానుగా పనిచేస్తున్న అరుణ్ కుమార్‌కు భరత్‌పూర్ జిల్లా ప్రిన్స్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం మార్చి 4వతేదీన చేద్దామని వధూవరుల కుటుంబసభ్యులు, పెద్దలు నిర్ణయించుకున్నారు.వధువు తరపు వారు పెళ్లి పత్రికలు పంచడంతో పాటు వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.వివాహం సమయానికి వరుడు అరుణ్ కుమార్‌ ముఖం చాటేసి మధురలోని ఆర్మీ ఆసుపత్రిలో చేరాడు. పెళ్లి సమయానికి బారాత్ తో రావాల్సిన వరుడు రాకపోయేసరికి ఆగ్రహించిన వధువు కాబోయే అత్తమామల ఇంటికి వెళ్లి అక్కడే భైఠాయించి ధర్నాకు దిగింది. 


వివాహ వేడుకకు రాకుండా వరుడు డుమ్మా కొట్టిన ఘటన చర్చనీయాంశంగా మారింది. వివాహం చేసుకుంటామని వరుడి తండ్రి చెప్పి మోసం చేశాడని ఆరోపిస్తూ అతనిపై కేసు పెట్టారు.దీంతో వరుడి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్మీ ఆసుపత్రిలో చేరిన సైనికుడు అరుణ్ కుమార్ తో తనను మాట్లాడించాలని డిమాండ్ చేస్తూ వధువు కాబోయే అత్తవారింటి ముందు ధర్నా కొనసాగిస్తోంది.విఫలమైన వివాహంపై ప్రశ్నించడానికి వరుడు అరుణ్ కుమార్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు  ఎదురుచూస్తున్నామని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్యామ్ సింగ్ చెప్పారు.


Updated Date - 2022-03-09T13:43:34+05:30 IST