కట్నంగా 21 తాబేళ్లు, నల్ల కుక్కు కావాలన్న వరుడికి భారీ షాక్!

Jul 22 2021 @ 20:08PM

ముంబై: వరకట్న వేధింపులు ప్రతినిత్యం దేశంలో ఏదో ప్రాంతంలో బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌ నగరానికి చెందిన ఓ యువకుడు 21 తాబేళ్లను కట్నంగా ఇవ్వాలంటూ వింత డిమాండ్ పెట్టాడు. అతడి తీరుతో నిర్ఘాంతపోయిన వధువు కుటుంబీకులు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. వధూవరులకు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో వధువు తల్లిదండ్రులు వరుడికి రూ.2 లక్షల నగదు, తులం బంగారాన్ని కట్నంగా ఇచ్చారు. ఆ తరువాత పెళ్లి ఏర్పాట్లలో మునిగిపోయారు. 

అంతాసవ్యంగా సాగిపోతోంది అని అనుకుంటున్న తరుణంలో వరుడు తన వింత కోరికల చిట్టాను బయటకు తీశాడు. కట్నంగా తనకు రూ. 10లక్షలు కావాలని డిమాండ్ చేయడంతో పాటూ  21 తాబేళ్లు, ఓ నల్ల కుక్క, బుద్ధుడి బొమ్మ, దీపం కుందెలు కావాలని పట్టుబట్టాడు. దీంతో..వధువు తరఫు వారు ఒక్కసారిగా షాకయ్యారు. ఇటువంటి వింత కోరికలు వద్దంటూ వరుడికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. ఇవి తమ శక్తికి మించిన డిమాండ్లంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ..వరుడు తన మనసు మార్చుకోకపోగా.. పెళ్లి చేసుకునేది లేదంటూ తేల్చి చెప్పాడు. దీంతో..షాకైన వధువు కుటుంబసభ్యులు మరోదారి లేక పోలీసులను ఆశ్రయించారు. ఫలితంగా నిందితుడిపై చీటింగ్‌ కేసు నమోదైంది.   

Follow Us on:

ప్రత్యేకంమరిన్ని...