అతను ఏకంగా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు.. తగ్గేదేలే అంటూ ఇంకా కొనసాగిస్తూ..

ABN , First Publish Date - 2022-01-30T06:19:04+05:30 IST

ఈ కాలంలో ఇద్దరు పిల్లలే చాలనుకుంటాం. వెనుకటి కాలంలో అయితే పది మంది సంతానం ఉన్నవారు ఉండేవారు. కానీ బ్రిటన్ కు చెందిన 66 ఏళ్ల క్లైవ్ జోన్స్ మాత్రం ఇప్పటివరకు 129 మంది పిల్లలకి తండ్రయ్యాడు. అయితే ఇది ఎలా సాధ్యమైందని అందరూ ఆశ్చర్యపోతుంటే..

అతను ఏకంగా 129 మంది పిల్లలకు తండ్రి అయ్యాడు.. తగ్గేదేలే అంటూ ఇంకా కొనసాగిస్తూ..

ఈ కాలంలో ఇద్దరు పిల్లలే చాలనుకుంటాం. వెనుకటి కాలంలో అయితే పది మంది సంతానం ఉన్నవారు ఉండేవారు. కానీ బ్రిటన్ కు చెందిన 66 ఏళ్ల క్లైవ్ జోన్స్ మాత్రం ఇప్పటివరకు 129 మంది పిల్లలకి తండ్రయ్యాడు. అయితే ఇది ఎలా సాధ్యమైందని అందరూ ఆశ్చర్యపోతుంటే.. ఆయన మాత్రం వీర్య దానం చేస్తూ ఈ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉన్నాడు. పాశ్చాత్య దేశాల్లో వీర్యదానం చేయడం సాధారణమే. 


క్లైవ్ జోన్స్ వీర్య దానం చేస్తూ త్వరలో మరో తొమ్మిది మంది పిల్లలను ఈ ప్రపంచంలో తీసుకురాబోతున్నాడు. మొత్తం 150 మందికి తండ్రి అయిన తర్వాత వీర్య దానం చేయడం ఆపేస్తానని ఆయన స్పష్టం చేశాడు. ఇంకా చెప్పాలంటే.. వీర్యం దానం చేసేందుకు జోన్స్ డబ్బులు కూడా తీసుకోవడం లేదట. గత 8 ఎనిమిది సంవత్సరాలుగా వీర్యదానం చేస్తున్నాని చెప్పాడు.


బ్రిటన్‌లో చాలా క్లినిక్ఋ‌లు వీర్యాన్ని కొనుగోలు చేస్తారు. 10 సంవత్సరాల క్రితం ఒక న్యూస్ పేపర్‌లో వచ్చిన కథనాన్ని చదివిన తర్వాత పిల్లలు లేని వ్యక్తులు ఎంత మానసిక వేదనకు అనుభవిస్తారో తెలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోన్స్ చెప్పారు. ఒకరికి సంతాన సుఖాన్ని అందిస్తే తనకు సంతోషం కలుగుతుందని ఆయన అన్నారు. 

అయితే జోన్స్ ఇదంగా అనధికారికంగా చేస్తున్నారు. ఎందుకంటే బ్రిటన్ లో వీర్యం దాత గరిష్ట వయస్సు 45 సంవత్సరాలు ఉండాలి. 


Updated Date - 2022-01-30T06:19:04+05:30 IST