Chips packet తెరిచి చూస్తే ఇది కనిపించింది

ABN , First Publish Date - 2021-10-19T22:06:19+05:30 IST

డేవిడ్ షేర్ చేసిన ఫొటోలో కత్తిగాట్లకు దెబ్బతిన్న నిండు బంగాళదుంప స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోకు ‘‘ఇది చూసి నా బుర్ర ఒక్కసారిగా గిర్రున తిరిగింది. కెటిల్‌ చిప్స్ ప్యాకెట్ తెరిచి చూడగానే నాకు చిప్స్ కనిపించలేదు. బంగాళదుపం దర్శనమిచ్చింది’’ అని డేవిడ్ ట్వీట్ చేశాడు..

Chips packet తెరిచి చూస్తే ఇది కనిపించింది

లండన్: ముప్పావు శాతం నైట్రోజన్ గ్యాస్‌తో నిండి ఉండే చిప్స్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే కరకరలాడే చిప్స్ కళ్లెదుట ఉంటాయి. బంగాళదుంపలను సన్నని లేయర్లుగా కోసి కాస్త మసాలా చల్లి వేయించే ఈ చిప్స్‌కు పిల్లల నుంచి పెద్దల వరకు అన్ని సందర్భాల్లో చిరు తిండిగా అత్యంత ఆదరణ ఉంది. నగరాల నుంచి పల్లెల వరకు ఏ దుకాణం తలుపు తట్టినా కనిపించే ఈ చిప్స్‌ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. అయితే చిప్స్ కొందామని అనుకున్న ఓ వ్యక్తికి చిప్స్‌కు బదులు బంగాళదుంప కనిపించి ఆశ్చర్యపరిచింది. బ్రిటన్‌కు చెందిన డాక్టర్ డేవిడ్ బోయిసీకి ఎదురైన అనుభవం ఇది. ఈ విషయాన్ని కాస్త ఆయన సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. నెట్టింట్లో వైరల్‌గా మారింది.


డేవిడ్ షేర్ చేసిన ఫొటోలో కత్తిగాట్లకు దెబ్బతిన్న నిండు బంగాళదుంప స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఫొటోకు ‘‘ఇది చూసి నా బుర్ర ఒక్కసారిగా గిర్రున తిరిగింది. కెటిల్‌ చిప్స్ ప్యాకెట్ తెరిచి చూడగానే నాకు చిప్స్ కనిపించలేదు. బంగాళదుంప దర్శనమిచ్చింది’’ అని డేవిడ్ ట్వీట్ చేశాడు. అయితే దీనికి సదరు సంస్థ స్పందించింది. ‘‘ఇలా ఎలా జరిగిందో మాకు తెలియదు. ప్యాకెట్‌ను పూర్తిగా ఫొటో తీసి పంపించింది. కారణాలు తెలుసుకుంటాం’’ అని డేవిడ్‌కు ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది.

Updated Date - 2021-10-19T22:06:19+05:30 IST