మాజీ భర్తకు ఊహించని షాకిచ్చిన మహిళ..! ఇలాంటి సీన్ మరెక్కడా చూసుండరు

ABN , First Publish Date - 2022-09-23T04:59:50+05:30 IST

విడాకులయ్యాకు ఒకరి ముఖాలు మరొకరు చూసుకునేందుకు కూడా స్త్రీపురుషులు ఇష్టపడరు. ఇక భర్త నుంచి విడిపోయిన ఆడవారు తమ పాత ఇంటిపేరునే మళ్లీ వాడటం మొదలెడతారు. కానీ..ఓ మహిళ మాత్రం వింతగా తన మాజీ భర్త ఇంటిపేరునే తన ఇంటిపేరుగా కొనసాగించింది.

మాజీ భర్తకు ఊహించని షాకిచ్చిన మహిళ..! ఇలాంటి సీన్ మరెక్కడా చూసుండరు

ఎన్నారై డెస్క్: విడాకులయ్యాకు ఒకరి ముఖాలు మరొకరు చూసుకునేందుకు కూడా స్త్రీపురుషులు ఇష్టపడరు. ఇక భర్త నుంచి విడిపోయిన ఆడవారు తమ పాత ఇంటిపేరునే మళ్లీ వాడటం మొదలెడతారు. కానీ..ఓ మహిళ మాత్రం వింతగా తన మాజీ భర్త ఇంటిపేరునే తన ఇంటిపేరుగా కొనసాగించింది. విషయం ఆ మాజీ భర్తకు తెలియడంతో అతడు వెర్రెత్తిపోయాడు. ఆమేమో ఇప్పుడేం చేయాలంటూ నెటిజన్ల సలహా కోరుతోంది. 


సదరు మహిళ ఓ ఆన్‌లైన్ చర్చావేదికలో తన సమస్యను నెటిజన్ల ముందుంచింది. తన కోలీగ్స్ అందరికీ తన మాజీ భర్త ఇంటిపేరు మాత్రమే తెలుసునని చెప్పుకొచ్చింది. కాబట్టి.. తన వృత్తి జీవితంలో ఎటువంటి ఇబ్బందులూ రాకుండా ఆ పేరునే వినియోగించేందుకు నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చింది. ఈ విషయం తెలిసి తన భర్త షాకైపోయాడని చెప్పింది. అతడి ఇంటి పేరును వదులుకేనేది లేదని మర్యాదగనే చెప్పా.. కానీ..ఆ తరువాత అతడు రెచ్చిపోయాడు. వరుస మేసేజీలతో తన అక్కసు అంతా వెళ్లగక్కాడు. నేను చేసింది తప్పంటారా..? అని ప్రశ్నించింది. తమకు పిల్లలు లేరన్న విషయాన్ని కూడా ప్రస్తావించింది. మరొవ్యక్తికి తాను దగ్గరయ్యాయని అతడికి ఈ విషయాలన్నీ తెలుసునని కూడా పేర్కొంది. అంతా విన్న నెటిజన్లు పలు రకాల సమాధానాలు ఇచ్చారు.


అనేక మంది ఆమెకు మద్దతుగా నిలిచారు. ఆమె చేసింది అస్సలు తప్పుకాదన్నారు. వృత్తిగత జీవితంలో ఆమెనందరూ అదే పేరుతో గుర్తిస్తున్నప్పుడు ఆ పేరును ఎలా వదులుకుంటామని వాదించారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసీ..తాము తమ భర్తలకు విడాకులివ్వాల్సి వస్తే..ఇలాగే చేస్తామని ఢంకా బజాయించి చెప్పారు. కెరీర్ మొత్తం ఆపేరుతోనే నిర్మించుకున్నప్పుడు దాన్ని వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2022-09-23T04:59:50+05:30 IST