
ఒక యువతిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు బలరాం వ్యాపారి అనే వ్యక్తి. ఆమెపై తన స్నేహితుడితో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను అక్కడే వదిలేస్తే తను చేసిన తప్పు అందరికీ తెలిసిపోతుందని అనుమానం వచ్చింది. అంతే, ఆమెను బలవంతంగా ఆగ్రా తీసుకెళ్లి అక్కడ ఒక ధనవంతుడికి ఆ యువతిని అమ్మేశాడు. ఆ తర్వాత పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న అతన్ని 26 ఏళ్ల తర్వాత ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో వెలుగు చూసింది.
బలరాం తన ఇంటికి సమీపంలో ఉండే అమ్మాయిని ఎత్తుకెళ్లి అత్యాచారం చేశాడు. దీనిలో తన స్నేహితుడి సాయం కూడా తీసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయిని ఆగ్రా తీసుకెళ్లి అమ్మేశాడు. తనను కొన్న వాళ్ల నుంచి ఎలాగోలా తప్పించుకున్న బాధితురాలు.. ఎట్టకేలకు ఇంటికి చేరుకొని అసలు విషయం అందరికీ చెప్పింది. అప్పటి నుంచి బలరాం పరారీలోనే ఉన్నాడు.
రకరకాల సిటీల్లో తిరుగుతూ పోలీసుల కళ్లు గప్పాడు. అయితే కొన్నిరోజుల క్రితం తన తల్లిని చూసేందుకు కాంకేర్కు తిరిగొచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి బలరాంను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి