ప్రియురాలికి రూ.75 లక్షలు ఇచ్చిన యువకుడు... తిరిగి చెల్లించమని అడిగితే.. ఆమె ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2022-01-30T05:56:42+05:30 IST

ఒక యువకుడు ఒక అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమించాడు. ఆమె కష్టాల్లో ఉందని తెలిసి ఇంట్లో తన తండ్రి(అమ్మకు రెండో భర్త) వద్ద నుంచి అప్పు తీసుకొని మరీ రూ.70 లక్షలు ఇచ్చాడు. డబ్బులు తీసుకునే సమయంలో ప్రియురాలు త్వరలోనే తిరిగి ఇస్తానని చెప్పింది. కానీ గడువు ముగిసినా డబ్బు ఇవ్వకపోవడంతో ఆ యువకుని ఒత్తిడి చేశాడు. అప్పుడు ఆ ప్రేమికుడు తను ప్రేమించిన అమ్మాయికి డబ్బులు గురించి ప్రశ్నించగా.. ఆమె తిరిగి చెల్లించేది లేదని చెప్పింది. పైగా.. ఒత్తిడి చేస్తే రేప్ కేసు పెడతానని బెదిరించింది...

ప్రియురాలికి రూ.75 లక్షలు ఇచ్చిన యువకుడు... తిరిగి చెల్లించమని అడిగితే.. ఆమె ఏం చేసిందంటే..

ఒక యువకుడు ఒక అమ్మాయిని ఎంతో గాఢంగా ప్రేమించాడు. ఆమె కష్టాల్లో ఉందని తెలిసి ఇంట్లో తన తండ్రి(అమ్మకు రెండో భర్త) వద్ద నుంచి అప్పు తీసుకొని మరీ రూ.70 లక్షలు ఇచ్చాడు. డబ్బులు తీసుకునే సమయంలో ప్రియురాలు త్వరలోనే తిరిగి ఇస్తానని చెప్పింది. కానీ గడువు ముగిసినా డబ్బు ఇవ్వకపోవడంతో ఆ యువకుని ఒత్తిడి చేశాడు. అప్పుడు ఆ ప్రేమికుడు తను ప్రేమించిన అమ్మాయికి డబ్బులు గురించి ప్రశ్నించగా.. ఆమె తిరిగి చెల్లించేది లేదని చెప్పింది. పైగా.. ఒత్తిడి చేస్తే రేప్ కేసు పెడతానని బెదిరించింది. దీంతో ఆ యువకుడు ఒకవైపు తండ్రి ఒత్తిడి.. మరో వైపు ప్రేయసి ద్రోహం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హర్యానాలోని ఫతేహాబాద్‌లో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. హర్యానా రాష్ట్రానికి చెందిన విక్రమ్ అనే యువకుడు షెఫాలీ అనే యువతిని ప్రేమించాడు. షెఫాలీ తల్లికి కేన్సర్ చికిత్స కోసం రూ.75 లక్షలు అవసరమని తెలిసి విక్రమ్ తన తండ్రి (తల్లి రెండో భర్త) నుంచి అప్పు తీసుకొని ఇచ్చాడు. విక్రమ్ తండ్రి ఓం ప్రకాశ్ పెద్ద వ్యాపారవేత్త. కొన్ని రోజుల తరువాత షెఫాలీ తన ఇల్లు అమ్మేసి డబ్బు చెల్లిస్తానని చెప్పింది. కానీ గడువు ముగిసినా ఆమె చెల్లించకపోవడంతో విక్రమ్ తండ్రి ఓం ప్రకాశ్ కోపడ్డాడు. 


షెఫాలీ గురించి ఆరా తీయగా.. ఆమె ఒక మోసగత్తె అని తెలిసింది. దీంతో ఓం ప్రకాశ్ తన కొడుకు విక్రమ్, షెఫాలీపై చీటింగ్ కేసు పెట్టాడు. ఆ తరువాత షెఫాలీని విక్రమ్ నిలదీయగా.. ఆమె డబ్బులు తిరిగిచ్చేది లేదని చెప్పింది. పైగా అతనిపై అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది. దీంతో విక్రమ్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. ఒకపైపు తన సవతి తండ్రి డబ్బుల కోసం అతనిపై చీటింగ్ కేసు పెట్టగా.. ప్రేమించిన అమ్మయి రేప్ కేసు పెడతానని బెదిరించింది. ఈ పరిస్థితుల్లో విక్రమ్ ఏం చేయాలో తోచక.. తన తండ్రి ఆఫీసులోనే విషం మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. 


పోలీసులు అతని మృతదేహం తమ ఆధీనంలోకి తీసుకొని పరీక్షించగా.. అతని జేబులో ఒక సూసైడ్ నోట్ దొరికింది. అందులో అతను షెఫాలీ చేసిన మోసం.. తన సవతి తండ్రి పెట్టే ఒత్తిడి గురించి రాశాడు. ప్రస్తుతం పోలీసులు విక్రమ్ తండ్రి ఓం ప్రకాశ్, ప్రియురాలు షెషాలీని విచారణ చేస్తున్నారు.


Updated Date - 2022-01-30T05:56:42+05:30 IST