గర్ల్‌ఫ్రెండ్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్‌గా మొబైల్ ఫోన్ ఇచ్చిన యువకుడు.. మొబైల్ ఫోన్ స్విచాన్ చేయగానే ఏం జరిగిదంటే..

ABN , First Publish Date - 2022-01-21T09:13:39+05:30 IST

న్యూ ఇయర్ కానుకగా ఒక యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఒక మొబైల్ ఫోన్ ఇచ్చాడు. ఆ మొబైల్ ఫోన్ ఉపయోగించిన మొదటి రోజే ఆ అమ్మాయి ఇంటికి పోలీసులు వచ్చారు. ఆ ఫోన్ దొంగతనం కేసులో ఆ అమ్మాయిని అరెస్టు చేశారు...

గర్ల్‌ఫ్రెండ్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్‌గా మొబైల్ ఫోన్ ఇచ్చిన యువకుడు.. మొబైల్ ఫోన్ స్విచాన్ చేయగానే ఏం జరిగిదంటే..

న్యూ ఇయర్ కానుకగా ఒక యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్‌కు ఒక మొబైల్ ఫోన్ ఇచ్చాడు. ఆ మొబైల్ ఫోన్ ఉపయోగించిన మొదటి రోజే ఆ అమ్మాయి ఇంటికి పోలీసులు వచ్చారు. ఆ ఫోన్ దొంగతనం కేసులో ఆ అమ్మాయిని అరెస్టు చేశారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ నగరంలో జరిగింది.


వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మాధోగంజ్ పట్టణానికి చెందిన కాలు(22) అనే యువకుడు తన గర్ల్‌ఫ్రెండ్ పింకీకి న్యూ ఇయర్ కానుకగా ఒక మొబైల్ ఫోన్ ఇచ్చాడు. పింకీ ఎంతో సంతోషంగా ఆ ఫోన్ ఉపయోగించడం మొదలు పెట్టింది. మరుసటి రోజు పింకీ ఇంటికి పోలీసులు వచ్చారు. ఆ ఫోన్ దొంగతనం చేయబడిందని చెప్పి పింకీని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.


పోలీసుల విచారణలో పింకీ తన బాయ్‌ఫ్రెండ్ కాలు గురించి చెప్పింది. దీంతో పోలీసులు కాలుని అరెస్టు చేసి.. మొబైల్ ఫోన్ గురించి ప్రశ్నించారు. అప్పుడు కాలు తను ఆ ఫోన్ మరొకరి నుంచి కొన్నానని చెప్పాడు. కానీ పోలీసులు కాలుకి ఒక వీడియో చూపించారు. అది ఒక సిసిటీవి వీడియో. అందులో కాలు, మరొక వ్యక్తితో కలిసి రోడ్డుపై స్కూలు నుంచి వస్తున్న ఒక అమ్మాయిని కత్తితో బెదిరించి ఆమె చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయారు. అది చూసిన కాలు తన బండారం బయటపడిందని అర్థం చేసుకున్నాడు. జరిగిన విషయం మొత్తం చెప్పాడు.


తన గర్ల్ ఫ్రెండ్ పింకీ ఒక కాస్ట్లీ మొబైల్ ఫోన్ గిఫ్ట్‌గా కావాలని అడిగింది. కానీ కాలు వద్ద అది కొనడానికి డబ్బులు లేవు. అయినా తన గర్ల్‌ఫ్రెండ్ అలగిందని.. ఎలాగైనా ఒక మొబైల్ ఫోన్ కావాలని తన మిత్రుడు శుభాష్‌తో చెప్పాడు. అప్పుడు శుభాష్ ఒక మొబైల్ ఫోన్ దొంగతనం చేద్దామని ప్లాన్ వేశాడు. అలా కాలు, అతని మిత్రుడు శుభాష్ మొబైల్ ఫోన్ కోసం 70 కిలోమీటర్ల దూరం గ్వాలియర్ వెళ్లి అక్కడ రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న ఒక స్కూల్ విద్యార్థిని చేతి నుంచి మొబైల్ ఫోన్ కాజేశారు. కానీ కాలు దాన్ని స్విచాఫ్ చేసి పెట్టాడు. వారం రోజుల తరువాత పింకీకి ఆ ఫోన్ కానుకగా ఇచ్చాడు. అలా జనవరి 16న పింకీ ఆ మొబైల్ ఫోన్‌ని స్విచాన్ చేయగా.. దాని ఐఎంఇఐ నెంబర్‌ను ట్రాక్ చేస్తూ పోలీసులు పింకీ ఇంటికి చేరుకున్నారు.


కాలు నేరం ఒప్పుకోవడంతో పోలీసులు అతనిపై దొంగతనం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. మరోవైపు కాలు స్నేహితుడు శుభాష్ కూడా పట్టుబడ్డాడు.


Updated Date - 2022-01-21T09:13:39+05:30 IST