girl friend మాట్లాడటం లేదని...బాయ్‌ఫ్రెండ్ ఏం చేశాడంటే...

ABN , First Publish Date - 2021-12-15T18:19:36+05:30 IST

తన గాళ్ ఫ్రెండ్ తనతో మాట్లాడటం లేదనే కోపంతో ఓ యువకుడు ఆమెను కత్తితో దాడి చేసి గాయపర్చిన దారుణ ఘటన...

girl friend మాట్లాడటం లేదని...బాయ్‌ఫ్రెండ్ ఏం చేశాడంటే...

గ్యాంగ్‌టక్(సిక్కిం):తన గాళ్ ఫ్రెండ్ తనతో మాట్లాడటం లేదనే కోపంతో ఓ యువకుడు ఆమెను కత్తితో దాడి చేసి గాయపర్చిన దారుణ ఘటన సిక్కింలోని గ్యాంగ్‌టక్ నగరంలో వెలుగుచూసింది.తటాంగ్ చెన్ నివాసి అయిన యువకుడు ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తన గాళ్ ఫ్రెండ్ గత కొన్ని రోజులుగా మాట్లాడటం లేదని, తన ఫోన్ కాల్ ను లిఫ్ట్ చేయడం లేదనే కోపంతో కత్తి తీసుకొని వచ్చిన గ్యాంగ్‌టక్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న యువతిపై దాడి చేశాడు. ఈ దాడిలో ఓ డాక్టర్ కూడా గాయపడ్డారు.తాను మాట్లాడటం లేదనే కోపంతోనే దాడి చేశాడని యువతి ఫిర్యాదు చేసింది. రక్తంతో తడిసిన కత్తితో ఆసుపత్రి బయట తిరుగుతున్న యువకుడిని పోలీసులు పట్టుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.

Updated Date - 2021-12-15T18:19:36+05:30 IST