యూట్యూబ్‌లో చూసి వాటి పెంపకం మొదలు పెట్టాడు.. అవే కావాలంటూ కుర్రాడి ఇంటి ముందు జనం క్యూ!

ABN , First Publish Date - 2021-11-17T17:18:10+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని రీవాకు చెందిన 22 ఏళ్ల కుర్రాడు తన వినూత్న ఆలోచనతో..

యూట్యూబ్‌లో చూసి వాటి పెంపకం మొదలు పెట్టాడు..  అవే కావాలంటూ కుర్రాడి ఇంటి ముందు జనం క్యూ!

మధ్యప్రదేశ్‌లోని రీవాకు చెందిన 22 ఏళ్ల కుర్రాడు తన వినూత్న ఆలోచనతో నెలకు 40 వేల రూపాయల వరకూ సంపాదిస్తున్నాడు. అది కూడా 10×10 గదిలో ఈ మొత్తం వ్యవహారమంతా నడిపిస్తున్నాడు. బీఎస్సీ గ్రాడ్యుయేట్ అయిన హరిఓం విశ్వకర్మ యూట్యూబ్‌లోని వీడియోలు చూస్తూ ఈ పనులు చేస్తున్నాడు. ఈ సందర్భంగా హరిఓం మీడియాతో మాట్లాడుతూ తాను ఉత్తరాఖండ్‌కు చెందిన దివ్యారావత్, ప్రీతి రూపొందించిన వీడియోలు చూసి, రీవాలోని కృషి విజ్ఞాన కేంద్రానికి వెళ్లానన్నారు.


అక్కడ డాక్టర్ కేవల్ సింగ్ బఘెల్ సాయంతో మష్రూమ్ పెంపకం గురించి తెలుసుకున్నానన్నారు. ఆయన పుట్టగొడుగుల విత్తనాలను తనకు అందించి ప్రోత్సాహించారన్నారు. దీంతో తాను గ్రామంలోని సొంత ఇంటిలోని ఒక 10×10 గదిలో పట్టుగొడుగులు పెంపకాన్ని చేపట్టానని, ఇందుకోసం గదిలోని నాలుగు గోడలను ప్లాస్టిక్ కవర్లతో కప్పేశానని దీంతో బయటి వేడి లోనికి రాకుండా ఉంటుందన్నారు. బయటి గోడలను గడ్డితో కప్పివేశానన్నారు. ఫలితంగా గదిలోని ఉఫ్ణోగ్రత మష్రూమ్ పెంపకానికి తగిన విధంగా తయారయ్యిందన్నారు. ఒక ప్లాస్టిక్ బ్యాగును ఒక కిలో గడ్డితో నింపి దానిలో 70 గ్రాముల మష్రూమ్ విత్తనాలను వేశానన్నారు. తరువాత బ్యాగును టైట్ చేసి టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ, గదిని చీకటిగా మార్చానన్నారు. ఆ బ్యాగుకు కింది భాగంలో, పై భాగంలో చిన్ని రంధ్రాలు చేశానని, తరువాత వాటిని వారం నుంచి ఒకటిన్నర వారం రోజుల పాటు అలానే వదిలివేశానన్నారు. తరువాత ఆ బ్యాగులు పుట్టగొడుగులతో తెల్లగా మారిపోయాయన్నారు.  తరువాత వీటిని గదిలో తగిన ఉష్ణోగ్రత వద్ద వేలాడదీశానన్నారు. రెండు వారాలలో పుట్టగొడుగులు అమ్మకానికి సిద్ధమయ్యాయన్నారు. ఈ మష్రూమ్ పెంపకంలో ఒక్కో బ్యాగు తయారీకి రూ. 17 ఖర్చవుతుండగా, రూ. 300 వరకూ ఆదాయం వచ్చే అవకాశాలున్నాయన్నారు. మష్రూమ్ పెంపకంతో తాను నెలకు రూ. 40 వేల వరకూ సంపాదిస్తున్నానని అన్నారు. కాగా హరిఓం విశ్వకర్మ సిద్ధం చేసిన మష్రూమ్ కొనుగోలు చేసేందుకు స్థానికులు అతని ఇంటికి వస్తున్నారు. 

Updated Date - 2021-11-17T17:18:10+05:30 IST