ప్రతీకాత్మక చిత్రం
నిజాలు చేదుగా ఉంటాయి.. కాబట్టే చాలా మంది నిజాలు చెబితే నమ్మరు. కానీ అబద్దాలు మాత్రం తీయగా ఉంటాయి.. అందుకనే వెంటనే నమ్మేస్తారు. ఇలా నమ్మే క్రమంలో చాలా మంది మోసపోవడం చూస్తుంటాం. బాలికలు, యువతులు, మహిళల విషయంలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. మాయ మాటలు నమ్మి.. చివరికి మానం, ప్రాణం పోగొట్టుకున్నవారిని ఎంతో మందిని చూశాం. కానీ ఇలాంటి దారుణాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో తాజాగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ‘‘నేను మీ నాన్నకు చాలా క్లోజ్’’.. అంటూ 40ఏళ్ల వ్యక్తి.. ఓ బాలికను నమ్మించాడు. తర్వాత జరిగిన ఘటన స్థానికులందరినీ షాక్‌కు గురి చేసింది.
మహారాష్ట్ర పరిధి పూణేకి చెందిన 11ఏళ్ల బాలిక.. స్థానికంగా ఉంటున్న ఓ పాఠశాలలో చదువుకుంటోంది. అదే ప్రాంతానికి చెందిన 40ఏళ్ల వ్యక్తి.. బాలికను రోజూ గమనించేవాడు. పాఠశాలకు వచ్చి పోయే క్రమంలో ఆమె వెనుకే వెళ్లేవాడు. ఎలాగైనా ఆమెను తన దారికి తెచ్చుకోవాలని కుట్రపన్నాడు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం బాలిక చదువుకుంటున్న పాఠశాలకు వెళ్లాడు. బాలికను పక్కకు పిలిచి.. ‘‘నేను! మీ నాన్నకు చాలా క్లోజ్’’.. అంటూ బాలికతో పరిచయం చేసుకున్నాడు. అతడి మాటలు నమ్మిన బాలిక.. మరికాస్సేపు సంభాషణ కొనసాగించింది. కొద్దిసేపటి తర్వాత మాట్లాడాలంటూ బాలికను పాఠశాల వాష్‌రూమ్‌కి తీసుకెళ్లాడు.
లోపలికి వెళ్లగానే.. ఒక్కసారిగా ఆమెపై బలత్కారానికి పాల్పడ్డాడు. బయట ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దీంతో బాలిక పాఠశాలలో ఎవరితోనూ చెప్పకుండా.. భయం భయంగా ఇంటికి వెళ్లిపోయింది. బాలిక ప్రవర్తనలో తేడా ఉండడతో తల్లిదండ్రులు నిలదీయగా.. విషయం బయటపడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని.. కేవలం పది గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది.
ఇవి కూడా చదవండి