అమ్మాయితో మాట్లాడొద్దని తమ్ముడికి వార్నింగ్ ఇచ్చాడు.. అయినా వినకపోవడంతో దారుణానికి తెగించాడు!

ABN , First Publish Date - 2022-03-08T17:30:37+05:30 IST

వారిద్దరూ కజిన్స్. వరసకు సోదరులు అవుతారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు.

అమ్మాయితో మాట్లాడొద్దని తమ్ముడికి వార్నింగ్ ఇచ్చాడు.. అయినా వినకపోవడంతో దారుణానికి తెగించాడు!

వారిద్దరూ కజిన్స్. వరసకు సోదరులు అవుతారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒకే యువతితో ప్రేమలో పడ్డారు. దాంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ అమ్మాయితో మాట్లాడొద్దని తమ్ముడికి అన్నయ్య వార్నింగ్ ఇచ్చాడు. అయినా తమ్ముడు వినలేదు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన అన్నయ్య.. తమ్ముడి గొంతు కోసి పారిపోయాడు. ప్రస్తుతం తమ్ముడు ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన సుందర్, జీవన్ అనే యువకులు వరసకు సోదరులు అవుతారు. కొన్నేళ్ల కిందట ఓ యువతితో సుందర్ ప్రేమలో పడ్డాడు. ఆమెను వివాహం చేసుకుందామనుకున్నాడు. ఆ యువతితోనే జీవన్ కూడా మాట్లాడేవాడు. ఆమెతో జీవన్ కూడా చనువుగా ఉండేవాడు. విషయం తెలుసుకున్న సుందర్.. ఆ అమ్మాయికి దూరంగా ఉండమని జీవన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. అయినా జీవన్ అతని మాట వినలేదు. 


ఈ విషయమై సోమవారం వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ క్రమంలో తనతో పాటు తెచ్చుకున్న కత్తితో జీవన్‌పై దాడి చేసిన సుందర్ అతని గొంతు కోసేశాడు. అనంతరం అక్కణ్నుంచి పరారయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే జీవన్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతను ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుందర్ కోసం గాలిస్తున్నారు. 

Updated Date - 2022-03-08T17:30:37+05:30 IST