పోలీసులు రవిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన రాజు ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల్లో ఉండగానే నిందితు డిని సాయంత్రం పోలీసులు వదిలిపెట్టారు. అదే రాత్రి తిరిగి తన తండ్రితో గొడవపడి ఇంట్లో నుండి బయటకు తీసుకువచ్చి రోడ్డుపై బండరాయితో మోది దారుణంగా తండ్రిని హత్య చేశారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. సోన్ సీఐ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కూచన్‌పెల్లి గ్రామంలో దారుణహత్యకు గురైన రాజన్న మృతదేహం పోస్టుమార్టంకు తీసుకెళ్లకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. రాజన్నను హత్య చేసిన కుమారుడు రవిని నిబంధనలకు విరుద్ధంగా అదే సాయంత్రం పోలీస్ స్టేషన్ నుండి వదిలిపెట్టడంతోనే రాజన్న హత్య జరి గిందని, దీనికి కారణమైన ఎస్సై సస్పెండ్ చేసే వరకు మృతదేహం తీసుకెళ్లేది లేదని పట్టుపట్టారు. ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. చివరకు డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి గ్రామస్థులతో మాట్లాడి తగ్గు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్థులు శాంతించారు.