35 మందితో ఒకేసారి ప్రేమాయణం.. కారణం తెలిస్తే షాకవుతారు

ABN , First Publish Date - 2021-04-24T01:55:51+05:30 IST

35 మందితో ఒకేసారి ప్రేమాయణం.. కారణం తెలిస్తే షాకవుతారు

35 మందితో ఒకేసారి ప్రేమాయణం.. కారణం తెలిస్తే షాకవుతారు

టోక్యో: "ఏంటి? ఒకేసారి 35 మందితో ప్రేమాయణమా? ఇది సాధ్యమేనా?" అని మీరు అనుకుని ఉండవచ్చు. కొన్ని జరిగితే కానీ సాధ్యం అనే విషయం బోధపడదు. కొందరికి ప్రేమించడం ఇష్టం. ప్రేమంటే ఎదుటి వారికి పంచేదే కదా..? అందుకే ఒకరికి మించి ఎక్కువ మందికి తమ ప్రేమను ఇచ్చేస్తుంటారు, విచ్చలవిడిగా ప్రేమించేస్తుంటారు. అలాగే జపాన్‌కు చెందిన తకాషీ మియాగావా (39) కూడా ప్రేమిస్తూ పోయాడు. ఇలా ప్రేమిస్తూ ప్రేమిస్తూ 35 మందితో ఏక కాలంలో ప్రేమాయణం నెరిపాడు. ఇంత మందితో ప్రేమాయణం అంటే దాని వెనకాల ఏదో కారణం ఉండే ఉంటుందనే అనుమానం చాలా మందికే వస్తుంది. ఆ అనుమానం నిజంగా నిజమే. నిజానికి తకాషీ ఇంత మందిని ప్రేమించింది బహుమతుల కోసం, అలాగే తన వ్యాపారం కోసం.


జపాన్‌లోని ఒసాకా ప్రాంతానికి చెందిన ఇతడు హైడ్రోజన్‌ వాటర్‌ షవర్‌ హెడ్స్‌, ఇతర పరికరాలు అమ్మే మార్కెటింగ్‌ కంపెనీలో పార్ట్‌టైమ్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇలా పని చేస్తూనే ఒంటరి మహిళలను టార్గెట్ చేసి ప్రేమగా మాట్లాడుతూ ముగ్గులోకి దింపుతూ వచ్చాడు. ఇలా ఏకంగా 35 మందిని ప్రేమ వలలోకి దింపాడు. ఇందులో అతడి కంటే పెద్దవారు కూడా ఉన్నారు. వీళ్లకు తన పుట్టిన రోజు ఉందంటూ వారి నుంచి ఖరీదైన బహుమతులు తీసుకున్నాడు. అందరి నుంచి ఒకేసారి తీసుకోవడం కష్టం కాబట్టి.. ఒక్కొక్కరికి ఒక్కో తేదీ చెప్పి బహుమతులు పొందేవాడు. ఇక ఎవరైనా పెళ్లి గురించి మాట్లాడితే లైఫ్ సెటిల్ అయ్యే వరకు ఆగాలని చెప్పుకొచ్చాడు. బహుమతులు మాత్రమే కాకుండా వారితో తన కంపెనీ ఉత్పత్తులు కూడా కొనేలా చేశాడు.


ఎంత పక్కాగా ఉంటేనేమి, ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటేనేమి ఆలస్యంగానైనా సరే ఏదో తప్పిదంతో ఎప్పుడో ఒకసారి విషయం బయటికి రాకుండా ఉండదు. మియాగావా విషయంలో కూడా అదే జరిగింది. పెళ్లి గురించి అడిగితే దాటవేస్తూ వచ్చిన అతడిపై కొందరికి అనుమానం కలిగింది. విషయం ఏంటని ఆరా తీస్తే.. డొంక మొత్తం కదిలింది. బహుమతుల కోసం ఉద్యోగంలో టార్గెట్ చేరుకోవడం కోసం ప్రేమాయణం అనే డ్రామా ఆడినట్లు ఒప్పుకున్నాడు. అనంతరం ఫిర్యాదుతో అరెస్ట్ అయ్యి కటకటాల వెనక బంధీ అయ్యాడు. ఇక ఈ ఉదంతంపై నెటిజెన్లు బాగానే స్పందిస్తున్నారు. మియాగావాను తిట్టేవాళ్లు తిడుతున్నారు. ‘‘నువ్వు మామూలోడివి కాదు సామీ’’ అంటూ జోకులు వేసే వాళ్లు వేస్తున్నారు.

Updated Date - 2021-04-24T01:55:51+05:30 IST