అతనో శాడిస్ట్.. తన విచిత్ర కోరిక కోసం నిద్రపోతున్న తన భార్యను ఎవరూ ఊహించని విధంగా ఏం చేశాడంటే..

ABN , First Publish Date - 2022-01-31T05:53:22+05:30 IST

అతనికి 46 ఏళ్ల వయస్సు. 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కానీ అతనిలో విపరీతమైన శృంగార కోరికలు ఉండేవి. తన సెక్స్ లైఫ్‌లో మజా కోసం ఏదైనా వెరైటీ చేయాలనుకున్నాడు. అప్పుడు అతనికి ఒక విచిత్ర ఆలోచన తట్టింది...

అతనో శాడిస్ట్.. తన విచిత్ర కోరిక కోసం నిద్రపోతున్న తన భార్యను ఎవరూ ఊహించని విధంగా ఏం చేశాడంటే..

అతనికి 46 ఏళ్ల వయస్సు. 23 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కానీ అతనిలో విపరీతమైన శృంగార కోరికలు ఉండేవి. తన సెక్స్ లైఫ్‌లో మజా కోసం ఏదైనా వెరైటీ చేయాలనుకున్నాడు. అప్పుడు అతనికి ఒక విచిత్ర ఆలోచన తట్టింది. దాని కోసం అతను పని చేసే ఆఫీసులో మిత్రుడి సహాయం తీసుకున్నాడు. 


ఒకరోజు రాత్రి తన మిత్రుడికి ఇంటికి భోజనానికి పిలిచాడు. ఇంట్లో అతని భార్య, మిత్రుడితో కలిసి భోజనం చేశాడు. భోజనం తరువాత ముగ్గురూ కలిసి కాస్త వైన్ తాగారు. కానీ భార్య తాగే వైన్ గ్లాసులో అతను మత్తు పదార్థం కలిపాడు. అది తాగిన అతని భార్యకు మత్తు ఎక్కగానే బెడ్‌రూం తీసుకెళ్లి పడుకోబెట్టి.. ఆమె కళ్లకు గంతలు కట్టేశారు. ఆ తరువాత అతని మిత్రుడు నగ్నంగా ఆమె పక్కకు చేరి ఆమెతో శృంగారం చేయబోయాడు. కానీ అప్పుడే ఆమె తన గంతలు తొలగించి చూసింది. ఆమె అరుపులకు అతని మిత్రుడు పారిపోయాడు.


అప్పుడు ఆ వ్యక్తి తన భార్యకు జరిగిన విషయం చెప్పాడు. ఇది విన్న అతని భార్య తన భర్త, అతని మిత్రుడిపై అత్యాచారం కేసు పెట్టింది. ఈ ఘటన సింగపూర్‌లో 2017లో జరిగింది. తాజాగా ఈ కేసులో సింగపూర్ హై కోర్టు తీర్పునిచ్చింది. మహిళ భర్త, అతని మిత్రుడికి అత్యాచర యత్నం చేసినందుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసులో మరో విషయమేమిటంటే.. కోర్టులో విచారణ జరుగుతుండగా.. సదరు వ్యక్తికి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ సమస్య ఉందని అతని భార్య చెప్పింది. 


కేరళలో ఇలాంటిదే మరో కేసు నవంబర్ 2021లో వెలుగులోకి వచ్చింది. అందులో భర్త తన భార్యను తన మిత్రుడి ఇంటికి తీసుకెళ్లి ఆమెను ఒక గదిలో బంధంచాడు. ఆ తరువాత అతని మిత్రుడు ఆమెను చితకబాది అత్యాచారం చేశాడు. ప్రస్తుతం ఆ కేసు విచారణలో ఉంది. 


Updated Date - 2022-01-31T05:53:22+05:30 IST