Viral Video: అరె! ఇతనేంటి.. నీటితో నిండిన వాటర్ బాటిళ్లను నోటితో ఊదేశాడు.. చూస్తే అవాక్కవుతారు..

ABN , First Publish Date - 2022-03-12T03:21:28+05:30 IST

అందరిలో ఒకరిలా ఉండాలని కొందరికి ఉంటే.. అందరికంటే భిన్నంగా ఉండాలని మరికొందరికి ఉంటుంది. సాధారణం కంటే భిన్నంగా చేస్తూ అందరి నోళ్లలో నానాలని శతవిధాలా..

Viral Video: అరె! ఇతనేంటి.. నీటితో నిండిన వాటర్ బాటిళ్లను నోటితో ఊదేశాడు.. చూస్తే అవాక్కవుతారు..

అందరిలో ఒకరిలా ఉండాలని కొందరికి ఉంటే.. అందరికంటే భిన్నంగా ఉండాలని మరికొందరికి ఉంటుంది. సాధారణం కంటే భిన్నంగా చేస్తూ అందరి నోళ్లలో నానాలని శతవిధాలా ప్రయత్నిస్తుంటారు. ఇంకొందరైతే ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని పనులు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంటూ ఉంటారు. ఇలాంటి వ్యక్తుల గురించి గతంలో ఎన్నో సార్లు చూశాం, విన్నాం. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి.. నీటితో నిండి ఉన్న వాటర్ బాటిళ్లను నోటితో ఊది కిందపడేస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇన్‌స్టాగ్రాంలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ ఇనుప గేటుపై నీటితో నిండిన వాటర్ బాటిళ్లను వరుసగా పేర్చి ఉంచుతారు. ఓ వ్యక్తి అక్కడకు వచ్చి ఆ బాటిళ్లను నోటితో ఊదేస్తాడు. ఒక్కో బాటిల్‌ను అవలీలగా ఊది కిందపడేస్తాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో బాటిళ్లను ఇలా ఊది.. అలా కిందపడేస్తాడు. నోటితో గాలిని కాసేపు ఊదితేనే అలసట వస్తుంది. అలాంటిది ఈ వ్యక్తి నోటితో ఇలా వాటర్ బాటిళ్లను వరుసగా కింద పడేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ వీడియో చూసిన వారంతా అతన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వాటర్ బాటిళ్లను దూది పింజల్లా కింద పడేశాడే... అంటూ కామెంట్లు పెడుతున్నారు.

పొలానికి నీరు పెడుతున్న కుక్క.. వామ్మో ఇదేం కుక్కరా నాయనా..





Updated Date - 2022-03-12T03:21:28+05:30 IST