వ్యక్తి దారుణ హత్య.. కారణం ఏంటో తెలిస్తే...

Sep 28 2021 @ 11:57AM

 బెంగళూరు: రెండేళ్లుగా భార్యతోపాటు కుటుంబానికి దూరంగా ఉన్నానని, మీ తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తానని, అందుకు సహకరించాలని కోరిన వ్యక్తిని కొడుకు హతమార్చిన సంఘటన తుమకూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా మురిగేరి గ్రామానికి చెందిన రాజణ్ణ (50) దారుణహత్యకు గురయ్యాడు. ఇదే గ్రామానికి చెందిన మహేశ్‌తో ఆదివారం పార్టీ చేసుకున్నాడు. ఈ సందర్భంలో రెండేళ్లుగా భార్యకు దూరంగా ఉన్నానని మీ తల్లితో వివాహేతర సంబంధం కొనసాగిస్తానని సహకరించాలని కోరాడు. అందరూ కలసి ఉందామని సూచించాడు. రాజణ్ణ మాటలతో ఒక్కసారిగా ఆవేశానికి లోనైన మహేశ్‌ వేటకొడవలితో దాడిచేసి హతమార్చాడు. రాజణ్ణ ఇటీవలి కాలంలో మహేశ్‌ కుటుంబీకులతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నించాడని, తల్లితో వివాహేతర సంబంధం విషయాన్ని నేరుగా ప్రస్తావించడమే గొడవకు కారణమైందని స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఈ మేరకు గుబ్బి పోలీసులు సోమవారం కేసు నమోదు చేసుకున్నారు. మహేశ్‌, రాజణ్ణలు ఆదివారం మద్యంపార్టీ చేసుకున్నారని ఇదే సందర్భంలోనే రాజణ్ణ వ్యాఖ్యలతో మహేశ్‌ ఆవేశానికిలోనై హతమార్చాడని భావిస్తున్నారు. మహేశ్‌పరారీలో ఉండగా డీఎస్పీ కుమారప్ప ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.