తిరుపతిలో దారుణ హత్య.. నడిరోడ్డుపై కత్తులతో పొడిచి..

ABN , First Publish Date - 2020-09-21T14:49:12+05:30 IST

తిరుపతి జ్యోతిథియేటర్‌ సమీపంలోని గిరిపురం ప్రాంతం. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయం. తన ఇంటి బయట ఫోను మాట్లాడుతున్న దినేష్‌ (30)ను కొందరు దుండగులు చుట్టుముట్టారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. ఛాతీ, పొట్టభాగంలో పలు కత్తిపోట్లు పొడవడంతోపాటు

తిరుపతిలో దారుణ హత్య.. నడిరోడ్డుపై కత్తులతో పొడిచి..

తిరుపతిలో దారుణ హత్య.. నడిరోడ్డుపై కత్తులతో పొడిచి..

నడిరోడ్డుపై కత్తులతో పొడిచిన దుండగులు 

హతుడు.. బెల్టు మురళి హత్యకేసులో నిందితుడు 


తిరుపతి(నేరవిభాగం): తిరుపతి జ్యోతిథియేటర్‌ సమీపంలోని గిరిపురం ప్రాంతం. ఆదివారం రాత్రి 9.30 గంటల సమయం. తన ఇంటి బయట ఫోను మాట్లాడుతున్న దినేష్‌ (30)ను కొందరు దుండగులు చుట్టుముట్టారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచారు. ఛాతీ, పొట్టభాగంలో పలు కత్తిపోట్లు పొడవడంతోపాటు విపరీతంగా రక్తస్రావం కావడంతో దినేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి బావమరిది, మామ అక్కడికి దగ్గరలోనే ఉన్నప్పటికీ దాడిని ఆపి రక్షించలేక పోయారు. నిందితులు మొత్తం ఐదుగురని, ద్విచక్రవాహనాల్లో వచ్చి దాడికి పాల్పడ్డారని మృతుడి మామ పేర్కొంటున్నారు. బెల్టు మురళి అన్న రవి కుమారుడు వినయ్‌ దాడిచేసినవారిలో ఉన్నట్టు వారు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న వెస్ట్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని రుయాకు తరలించేందుకు ప్రయత్నించగా.. బంధువులు అడ్డుకున్నారు. హంతకులకు అధికార పార్టీ నాయకుల అండ ఉందంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిందితులను తక్షణం అరెస్ట్‌ చేస్తామని హామీ ఇచ్చేవరకు కదలనీయమంటూ భీష్మించారు. దీంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించి మృతదేహాన్ని రుయాకు తరలించారు.  అర్బన్‌ ఎస్పీ రమేష్‌రెడ్డి, ఏఎస్పీ అనిల్‌బాబు, వెస్ట్‌ డీఎస్పీ నరసప్ప ఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. సీసీ ఫుటేజీ సేకరిస్తున్నామని, నిందితులను తక్షణం అరెస్టు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. పుణ్యక్షేత్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నిందితుల పట్ల కఠినంగా వ్యవహరి స్తామని చెప్పారు. బెల్టు మురళికి చెందిన వారే హత్య చేశారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారన్నారన్నారు. 


బెల్టు మురళి హత్య కేసులో ఏ11

2017లో పరసాలవీధికి చెందిన భార్గవ్‌ను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. భార్గవ్‌ హత్యకేసులో ఏ1గా ఉన్న బెల్టు మురళిని 2019 డిసెంబరు 21న లీలామహల్‌ కూడలి సమీపంలో ప్రత్యర్థులు కత్తులతో పొడిచి, రాడ్లతో తలపై మోది హత్య చేశారు. ఈ హత్యకు సంబంధించి 17 మంది నిందితులపై ఈస్ట్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసులో ప్రస్తుతం హత్యకు గురైన దినేష్‌  ఏ11గా ఉన్నాడు. అప్పట్లో బెల్టు మురళి హత్యకు నలుగురు నిందితులను సుపారీపై తమిళనాడు నుంచి దినేష్‌ తీసుకొచ్చినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. మృతుడిపై రౌడీషీట్‌ కూడా ఉంది. 



Updated Date - 2020-09-21T14:49:12+05:30 IST