రాత్రికి రాత్రే అకౌంట్లోకి రూ.2.77 కోట్లు.. బ్యాంక్ బ్యాలెన్స్ చూసి కంగుతిన్న 24 ఏళ్ల కుర్రాడు.. వెంటనే మాస్టర్ ప్లాన్..!

ABN , First Publish Date - 2022-05-17T00:41:49+05:30 IST

కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక కష్టాల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు రకరకాల పథకాలు ప్రకటించాయి.

రాత్రికి రాత్రే అకౌంట్లోకి రూ.2.77 కోట్లు.. బ్యాంక్ బ్యాలెన్స్ చూసి కంగుతిన్న 24 ఏళ్ల కుర్రాడు.. వెంటనే మాస్టర్ ప్లాన్..!

కరోనా మహమ్మారి సృష్టించిన ఆర్థిక కష్టాల నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు రకరకాల పథకాలు ప్రకటించాయి. జపాన్ ప్రభుత్వం తన దేశ ప్రజలకు కోవిడ్ రిలీఫ్ ఫండ్ అందిస్తోంది. ఒక్కొక్క కుటుంబం ఖాతాలోకి నేరుగా పది వేల యెన్‌లు (రూ.60 వేలు) జమ చేస్తోంది. ఈ క్రమంలో అనుకోకుండా ఓ తప్పు జరిగిపోయింది. అబు అనే నగరంలో ఉన్న 463 కుటంబాల కోసం 46.3 మిలియన్ యెన్‌ (రూ.2.77 కోట్లు)లు విడుదల చేసింది. అయితే ఆ డబ్బంతా ఒకే వ్యక్తి ఖాతాలోకి జమ చేయడంతో చిక్కు వచ్చి పడింది.


తన అకౌంట్లోకి వచ్చి పడిన డబ్బు చూసి ఆ 24 ఏళ్ల కుర్రాడు వెంటనే మాస్టర్ ప్లాన్ వేశాడు. బ్యాంక్ వారికి అనుమానం రాకుండా ఉండేందుకు తన అకౌంట్ నుంచి ఇతర అకౌంట్లకు డబ్బు బదిలీ చేస్తుండేవాడు. రెండు వారాలు ఇదే పనిలో ఉన్నాడు. బ్యాంక్ అధికారులకు విషయం తెలిసి డబ్బు డిపాజిట్ అయిన అకౌంట్ చూసేసరికి అందులో డబ్బుల్లేకుండా పోయాయి. దీంతో వారు షాకయ్యారు. బ్యాంక్ సిబ్బంది చేసిన పొరబాటుకు ఆ నగర మేయర్ క్షమాపణలు చెప్పారు. ఆ డబ్బులు తిరిగి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. 


తన అకౌంట్‌లో డబ్బు పడిన నాటి నుంచి ఆ వ్యక్తి ఎవరికీ కనపడకుండా పరారీలో ఉన్నాడు. జాబ్ మానేసి, ఇల్లు వదిలి పారిపోయాడు. అతని కోసం తీవ్రంగా గాలించి ఎట్టకేలకు 2022 ఏప్రిల్ 21న కనిపెట్టారు. తన అకౌంట్ నుంచి డబ్బులుపోయాయని, వాటిని తిరిగి తీసుకురాలేమని ఈ నేరానికి తగిన శిక్ష అనుభవిస్తానని ఆ యువకుడు చెబుతున్నాడు. కాగా, తమదే పొరపాటు కావడంతో బ్యాంక్ అధికారులు అతనిపై దొంగతనం కేసు నమోదు చేయడానికి వీల్లేకుండాపోయింది. న్యాయవాదులను సంప్రదించి దావా వేయడం ద్వారా ఆ యువకుడిపై గత శనివారం అధికారులు కేసు పెట్టారు.

Updated Date - 2022-05-17T00:41:49+05:30 IST