Shocking: భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భర్త.. కారణమేంటో తెలిస్తే షాక్!

ABN , First Publish Date - 2022-09-03T02:09:27+05:30 IST

ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది.

Shocking: భార్య స్నానం చేస్తుండగా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భర్త.. కారణమేంటో తెలిస్తే షాక్!

ప్రస్తుతం సోషల్ మీడియా ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోయారు. సోషల్ మీడియా లైక్‌లు, ఫాలోవర్ల కోసం ఆరాటపడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడం తన భార్యనే ఎరగా వేశాడు. ఆమె స్నానం చేస్తుండగా తీసిన వీడియోను (Bathing video) సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 


ఇది కూడా చదవండి..

Swiggy Instamart లో కండోమ్స్‌ను తెగ ఆర్డర్ చేసేస్తున్నారట.. ఏ నగర వాసులు ఏమేమి ఆర్డర్ ఇస్తున్నారంటే..!


ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ఫిరోజాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన భార్య స్నానం చేస్తుండగా తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సోషల్ మీడియాలో ఫాలోవర్లను పెంచుకోవడానికే అతను ఈ ఘటనకు పాల్పడ్డాడని భార్య ఆరోపిస్తోంది. తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త ఢిల్లీలోని ఓ సర్కస్‌ కంపెనీలో పనిచేస్తున్నాడని, ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా వీడియోలు పోస్ట్ చేస్తుంటాడని పేర్కొంది. అయితే తన ఇన్‌స్టా ఫాలోవర్ల సంఖ్య తక్కువగా ఉందని తరచుగా బాధపడేవాడని తెలిపింది. 


కొన్ని రోజుల క్రితం స్నానం చేస్తుండగా తన భర్తతో వీడియో కాల్ మాట్లాడానని, దానిని తన భర్త రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేశాడని ఫిర్యాదు చేసింది. ఆ ఫొటోలను, వీడియోలను వెంటనే తొలగించాలని తాను అడిగితే భర్త అందుకు నిరాకరించాడని తెలిపింది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-09-03T02:09:27+05:30 IST